
📌 Key Points
- మహేష్ బాబు పంచులు, కామెడీ టైమింగ్ సినిమాల్లోనే కాదు, బయట కూడా ప్రసిద్ధి.
- ఈటీవీ 30 ఏళ్ల వేడుకలో అలీ, మహేష్ బాబు అల్లరిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
- శ్రీమంతుడు షూటింగ్‌లో శృతి హాసన్ ఆలస్యంపై అలీ చేసిన వ్యాఖ్యలను మహేష్ ఆమెకు చెప్పారు.
- కమల్ హాసన్ కూతురు కదా ఆలస్యం చేస్తుందని అలీ అన్నట్లు మహేష్ హాస్యంగా ఇరికించారు.
మహేష్ బాబు తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్విస్తారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఆయన చాలా సరదాగా ఉంటారు. తాజాగా కమెడియన్ అలీ, ఈటీవీ 30 ఏళ్ల వేడుకలో మహేష్ చిలిపి అల్లరి గురించి చెప్పిన సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. శ్రీమంతుడు షూటింగ్‌లో జరిగిన ఆ ఆసక్తికర సన్నివేశం ఏమిటో తెలుసుకుందాం.
మహేష్ బాబు అల్లరి మామూలుగా ఉండదు
Mahesh Babu : మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోతుందని అందరికి తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా బయట కూడా మహేష్ సరదాగా ఉంటూ కామెడీ చేస్తాడు, పంచులు వేస్తాడు. సైలెంట్ గా కనిపిస్తూనే పంచులు వేసి నవ్విస్తాడు. తాజాగా కమెడియన్ అలీ మహేష్ బాబు అల్లరి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు.(Mahesh Babu)
ఈటీవీ 30 ఏళ్ళ ఈవెంట్ శ్రీకాకుళంలో జరిగింది. తాజాగా ఈ ఈవెంట్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్లో యాంకర్ ప్రదీప్ కమెడియన్ అలీని మీకు పరిచయం ఉన్న అందరి హీరోల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు అని అడిగాడు.
అలీ చెప్పిన మహేష్ చిలిపి సంఘటన
దీనికి అలీ సమాధానమిస్తూ.. మహేష్ బాబు బాగా అల్లరి చేస్తాడు. శ్రీమంతుడు షూటింగ్ సమయంలో ఓ సారి శృతి హాసన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటి ఈ అమ్మాయి ఇంకా రాలేదు అన్నారు మహేష్. నేను సరదాగా వచ్చేస్తుంది లెండి కమల్ హాసన్ కూతురు కదా అన్నాను. ఆ అమ్మాయి సెట్ కి వచ్చిన తర్వాత మహేష్ ఆమె దగ్గరకు వెళ్లి ఇదిగో శృతి అలీ ఏమంటున్నాడో తెలుసా కమల్ హాసన్ కూతురు కదా లేట్ గా వస్తుంది అంటున్నాడు అంటూ ఆమెకు చెప్పి ఇరికించాడు అని తెలిపారు.
శృతి హాసన్ దగ్గర అలీకి మహేష్ షాక్
మహేష్ బాబు సరదా, చిలిపి స్వభావం అభిమానులకు ఎప్పుడూ నచ్చుతుంది. అలీ చెప్పిన ఈ సంఘటన మహేష్ తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎంత సరదా మనిషిో రుజువు చేస్తుంది. ఈ జ్ఞాపకాలు ఆయన స్టార్‌డమ్‌కి మరింత వన్నె తెస్తాయి.


