
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం శ్రీలీల కొన్ని అవకాశాలను వదులుకుంది.
- శ్రీలీల చేసిన త్యాగానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హరీష్ శంకర్ అన్నారు.
- శ్రీలీలను ఐరన్ లెగ్ అని ట్రోల్ చేసిన వారికి ఆమె గోల్డెన్ లెగ్ అని సమాధానం చెబుతామన్నారు.
- పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం శ్రీలీల కొన్ని అవకాశాలను వదులుకుంది. ఆమె చేసిన త్యాగానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హరీష్ శంకర్ తెలిపారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
శ్రీలీల త్యాగం వెనుక హరీష్ శంకర్
Harish shankar: హరీష్ శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. హరీష్ శంకర్ ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని చాలాకాలం అవుతుంది .ఈ నేపథ్యంలోనే సరైన సక్సెస్ కోసం ఈయన ఎదురుచూస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని గంటలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా విడుదలకు అన్ని సిద్ధం కావడంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్లను మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు నిర్మాతలు నటి శ్రీలీల కూడా పాల్గొన్నారు. ఈ సినిమా ప్రకటించిన దాదాపు నాలుగు సంవత్సరాలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అయ్యింది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆలస్యం
ఇలా ఈ సినిమా చాలా సంవత్సరాలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో మీడియా వారి నుంచి నటి శ్రీలీలకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నారు అయితే ఈ సినిమా కోసం మీరు ఏదైనా వచ్చిన అవకాశాలను వదులుకున్నారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శ్రీలీల సమాధానం చెబుతూ తనకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయని కాకపోతే ఈ సినిమా కోసం పక్కన పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇలా శ్రీలీల చెప్పడంతో వెంటనే డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ మరిన్ని విషయాలను బయటపెట్టారు.
ఐరన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్…
శ్రీలీలకు గోల్డెన్ లెగ్ అని నిరూపిస్తాం: హరీష్
ఈ సినిమా కోసం శ్రీలీల చాలా త్యాగాలు చేసిందని తెలిపారు. అయితే ఆమె చేసిన త్యాగానికి కచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని, మేము వడ్డీతో సహా తనకు సక్సెస్ తిరిగి అందిస్తాము అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ద్వారా శ్రీలీలకు అద్భుతమైన హిట్ పడుతుందని హరీష్ శంకర్ చెప్పకనే చెప్పేశారు. ఇటీవల కాలంలో శ్రీలీలకు సరైన సక్సెస్ లేని నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై గతంలో స్పందించిన హరీష్ శంకర్ ట్రోల్ చేసిన వారే శ్రీలీలను గోల్డెన్ లెగ్ అనేలా చేస్తానని ఈ సినిమా అలాంటి సక్సెస్ అందిస్తుంది అంటూ ఈయన మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వడ్డీతో సహా శ్రీలీలకు తిరిగి ఇస్తామంటూ ఈయన మాట్లాడటంతో సినిమాపై ఏ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్నారో స్పష్టమవుతుంది. మరి హరీష్ శంకర్ కు, నటి శ్రీలీలకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.
శ్రీలీల పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆమె కెరీర్ ఒక మలుపు తిరుగుతుందని ఆశిద్దాం. ఆమెకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.


