|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హర్ష సాయి మాయ: మెగా మూవీ మోసం వెనుక అసలు నిజాలు! ఎక్కడ దాక్కున్నాడో?

Published: 07-04-2026, 9:05 AM
హర్ష సాయి మాయ: మెగా మూవీ మోసం వెనుక అసలు నిజాలు! ఎక్కడ దాక్కున్నాడో?
  • హర్ష సాయి యూట్యూబ్ ద్వారా సేవ పేరుతో మోసం చేశాడని ఆరోపణలు.
  • ‘మెగా’ సినిమా నిర్మాత హర్ష సాయిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది.
  • హర్ష సాయి సినిమా అవకాశాల కోసం సొంత ఇమేజ్ పెంచుకున్నాడని విమర్శలు.
  • కేసు నమోదయినప్పటి నుండి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

హర్ష సాయి సడన్ గా మాయం కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యూట్యూబ్ ద్వారా సేవ పేరుతో మోసం చేశాడని, ‘మెగా’ సినిమాతో మోసాలకు పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. అసలు హర్ష సాయి ఎక్కడికి వెళ్ళాడు?

హర్ష సాయి అదృశ్యం వెనుక కారణాలేమిటి?

Harsha Sai : హర్ష సాయి ..ఆ మధ్య ఈ పేరు సోషల్ మీడియాని ఎంతలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో ఇతగాడి సేవా కార్యక్రమాల వీడియోలు తెగ చక్కర్లు కొట్టాయ్. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారెవరినైనా ఆదుకుంటా అంటూ బాబా రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన ఈయన వీడియోలు చూసి లక్షల సంఖ్యలో  ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. అయితే ఇంతలా క్రేజ్ కొట్టేసిన హర్ష సాయి సడెన్ గా మాయం అవడంతో  ‘మత గురువు’ రేంజ్‌లో ప్రొజెక్ట్ చేసుకున్న ఈ సోషల్ మీడియా స్టార్ ‘అసలెక్కడికి వెళ్ళిపోయాడు,కొంపదీసి  పోలీసుల భయంతో అడ్రస్ లేకుండా పారిపోలేదు కాదా’ అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజనులు.ఒకవైపు పెళ్లి పేరుతో మోసం, మరోవైపు సినిమా ముసుగులో చీటింగ్ అలిగేషన్స్ అన్నీకలగలిపి హర్ష సాయి ‘మెగా’ ఇమేజ్ ఇప్పుడు అట్టడుగుకు పడిపోయినట్టే కనిపిస్తుంది.

నిజానికి హర్ష సాయి చేసే వీడియోలు చూసి ఏంతో మంది అమాయకులు దేవుడిలా కొలిచారన్నది నిజం. ఆ సహాయం వెనుక ఉన్నది చేయాలన్న మనసు కాదు,కేవలం యూట్యూబ్ వ్యూస్ ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఇన్కమ్  మాత్రమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. చారణ కోడికి బారాణా మసాలా అన్నట్టుగా ఒక రూపాయి ఇచ్చి పది రూపాయల పబ్లిసిటీ చేసుకున్నాడని, ఇదే కాన్సెప్ట్ తో ఏకంగా సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకొని  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘కొత్త మెగాస్టార్’ అనిపించుకోవాలని చూసిన అతడి ప్లాన్ ఇప్పుడు బెడిసికొట్టిందనే చెప్పాలి.

హర్షపై సెక్సువల్ హెరాస్ మెంట్ కేస్

నిజానికి హర్ష సాయి కథ, దర్శకత్వంలో ‘మెగా’ అనే సినిమా మొదలైనప్పుడు టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ ఆ గాలి అప్పటి వరకే అన్నట్టుగా మెల్లిగా ఈ సినిమా వెనుక డార్క్ షేడ్స్ మెల్లిగా బయటికి వస్తుండటం తో అతగాడి లీలలు ఒక్కోటిగా బయటకి వస్తున్నాయ్.ముఖ్యంగా  ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్న అమ్మాయే  స్వయంగా హర్షపై సెక్సువల్ హెరాస్ మెంట్ కేస్ పెట్టడం సంచలనం సృష్టించింది.సినిమా షూటింగ్ సాకుతో ఆమెను ఆర్థికంగా, మానసికంగా వేధించాడనే వార్తలు హర్ష సాయి అసలు రంగును బయటపెట్టాయి.ఇక ఆ కేసు ఫైల్ అయినప్పటి నుండి హర్ష సాయి సోషల్ మీడియాకు, కనీసం ఫోన్ సిగ్నల్‌కు కూడా దొరకకుండా పోయాడు.

‘మెగా’ సినిమా వివాదాలు, ఆరోపణలు

దుబాయ్ షేక్ అయ్యావా లేక దుబాయ్ పారిపోయావా?

దీంతో గత ఏడాది నుండి హర్ష సాయి నుంచి ఒక్క అప్‌డేట్ కూడా లేకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలర్స్ పండగ చేసుకుంటున్నారు.’దానం చేసేప్పుడు కెమెరా ఉండేది.. ఇప్పుడు ఎక్కడా కెమెరా కనిపించడం లేదా బ్రో?’అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే ‘దుబాయ్ షేక్ అయ్యావా లేక దుబాయ్ పారిపోయావా?”అంటూ హర్ష గత వీడియోలను పేరడీ చేస్తు చెడుగుడు ఆడేస్తున్నారు. అయితే  పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న వార్తలతో, హర్ష సాయి దేశం దాటి వెళ్లిపోయాడనే ప్రచారం గట్టిగానే  సాగుతోంది.

మెగా’ టైటిల్‌తో మొదలైన  సినిమా అటకెక్కినట్టే?

సోషల్ మీడియాలో హర్ష సాయిపై విమర్శలు

ఇక అట్టహాసంగా రెండేళ్ల క్రితం ‘మెగా’ టైటిల్‌తో మొదలైన  సినిమా ఇప్పుడు పూర్తిగా అటకెక్కినట్టే కనిపిస్తోంది.అప్పట్లో   భారీ బడ్జెట్, పాన్ ఇండియా లెవల్ అంటూ తెగ హడావిడి చేసిన  హర్ష, ఇప్పుడు కనీసం తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేయడం చూస్తుంటే.. ఆ సినిమా కేవలం ఒక పబ్లిసిటీ గిమ్మిక్కేనా? అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

ఏది ఏమైనా  రీల్ లైఫ్‌లో హీరోలా కనిపించిన హర్ష సాయి, రియల్ లైఫ్ వివాదాల్లో చిక్కుకుని తన ఇమేజ్‌ను మొత్తం పాడు చేసుకున్నాడనే చెప్పాలి. మరి ఈ ‘రీల్ మెగాస్టార్’వివాదాల నుండి బయటపడి మళ్ళీ కెమెరా ముందుకు వస్తాడో .. లేక ఇలాగే అజ్ఞాత వాసిగా మిగిలిపోతాడో కాలమే డిసైడ్ చేయాలి !

హర్ష సాయి అదృశ్యం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ‘మెగా’ సినిమా వివాదాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు అతని పతనానికి కారణమయ్యాయా? నిజం ఏమిటో తేలాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.