
📌 Key Points
- హర్ష సాయి సినిమా ప్రారంభం అయ్యాక అతని ప్రవర్తనలో మార్పులు, ఇది వివాదాలకు దారితీసింది!
- హర్షసాయి పై నిర్మాత మోసం ఆరోపణలు, పెళ్లి పేరుతో కేసు నమోదు కావడం సంచలనం!
- రెండేళ్ల క్రితం ప్రారంభమైన ‘మెగా’ మూవీ ఆగిపోవడానికి గల కారణాలు అన్వేషణలో!
- హర్షసాయి యూట్యూబ్ వీడియోలు ఆపేయడానికి, సోషల్ మీడియాకు దూరం కావడానికి అసలు కారణం ఇదేనా?
ఒకప్పుడు యూట్యూబ్ సెన్సేషన్, పేద ప్రజల పాలిట దేవుడు హర్ష సాయి. సడన్ గా సినిమా స్టార్ట్ చేసి మాయం అయిపోయాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు అదృశ్యమయ్యాడు? ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలంటే చదవండి.
హర్ష సాయి సడన్ గా మాయం అవ్వడానికి కారణం ఏంటి?
ఒకప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్స్ లో హర్ష సాయి ఒకడు. ఎవరు చేయలేని డిఫరెంట్ కాన్సెప్ట్ లను తెరపైకి తెచ్చి..బుల్లితెర స్టార్ గా మారిన హర్షసాయి హీరోగా ఓ సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు అవుతోంది.. యూట్యూబ్ లో హర్షసాయి వీడియో పెట్టి ఏడాదిపైనే అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏమైంది, హర్షసాయి ఎక్కడికెళ్లాడు.. సోషల్ మీడియాలో ఎందుకు కనిపించడంలేదు?
యూట్యూబ్ లో వీడియోలతో ఫేమస్ అయిన హర్షసాయి.. పేదోళ్ల కలలు నెరవేరుస్తూ.. వాళ్లకు డబ్బుసాయం చేస్తూ, కోరిన వస్తువులు కొనిస్తూ, పిల్లల చదువులకు సహాయం చేస్తూ.. ఆ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఒక పెద్ద టీమ్ ను కూడా ఏర్పాటు చేసి.. తన యూట్యూబ్ పరిధిని కూడా పెంచుకున్నాడు.
భారీగా డబ్బులు కూడా సంపాదించాడు స్టార్ యూట్యూబర్. అంతకు మించి ఇమేజ్ ను కూడా సాధించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ గా మారిన తరువాత, అతనికి సినిమా అవకాశం కూడా వచ్చింది. మెగా పేరుతో ఓ మూవీ కూడా స్టార్ట్ చేశాడు.
‘మెగా’ సినిమా ఆగిపోవడానికి అసలు కారణాలు ఇవేనా?
హర్ష సాయి వీడియోలు నచ్చిన ఓ అమ్మాయి అతనితో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చింది. తాను నిర్మాతగా వ్యవహరిస్తూ, హర్షసాయి కథ, దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ‘మెగా’ అనే టైటిల్‌తో ఒక సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత హర్షసాయి వీడియోలు మరింత వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సినిమా పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది.
టాలీవుడ్‌లో కొత్త మెగాస్టార్ వచ్చాడనే స్థాయిలో అతనిని ప్రచారం చేశారు. దీంతో హర్షసాయి పేరు సోషల్ మీడియాలో మారుమోగి పోయింది. రెండేళ్ల క్రితం కొత్త సినిమా స్టార్ట్ చేసిన హర్షసాయి.. ఆతరువాత అసలు కనిపనించకుండా పోయాడు. ఆయన సినిమా ఏమయ్యిందో తెలియదు.
రెగ్యూలర్ గా చేయాల్సి యూట్యూబ్ వీడియోలు కూడా మానేశాడు. దాదాపు ఏడాదిగా ఒక్క వీడియో కూడా ఆయన యూట్యూబ్ లో పోస్ట్ అవ్వలేదు. ఓ వీవాదంలో చిక్కుకున్న హర్షపై పోలీస్ కేసు కూడా అయ్యింది. నెట్టింట రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ హర్ష ఎక్కడ ఉన్నాడు.
నిర్మాత ఆరోపణలు.. హర్ష సాయికి కొత్త కష్టాలు!
సినిమా స్టార్ట్ అయ్యక హర్ష సాయి యాటీట్యూడ్ మారిపోయినట్టు తెలిసింది. సినిమా స్టార్ట్ అయిన కొంత కాలానికి ఆ సినిమాను నిర్మిస్తున్న యువతి..హర్షపై రకరకాల ఆరోపణలు చేసింది.
పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె కేసు నమోదు చేయించింది. ఈ వ్యవహారం అప్పట్లో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆతరువాత హర్షసాయి కనిపించడం మానేశాడు. ఈ విషయంలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మీమ్స్, ట్రోల్స్ తో పాటు పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి.
సినిమా స్టార్ట్ చేసి రెండేళ్లు అవుతోంది.. వీడియో పోస్ట్ చేసి ఏడాది అవుతోంది.. ఇంత వరకూ అడ్రెస్ లేకుండా పోయాడు అని ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ కు రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. దుబయ్ పారిపోయాడని కొందరు, జైల్లో ఉన్నాడని కొందరు, ఎక్కడికో పారిపోయాడని మరికొందరు, బాగా ఓవర్ యాక్షన్ చేశాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ హర్ష సాయి ఏమైపోయాడు అనేది మాత్రం ఇంత వరకూ ఎవరికి తెలియదు.
హర్ష సాయి గురించిన ఈ షాకింగ్ విషయాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాం.


