
📌 Key Points
- ప్రసాద్ బాబు 1500 చిత్రాల్లో నటించి, తన కుటుంబం సంతోషంగా ఉందని తెలిపారు.
- శ్రీకర్ గ్లిజరిన్ లేకుండానే ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటిస్తాడని ప్రసాద్ బాబు అన్నారు.
- ప్రసాద్ బాబు కోడలు ఒకప్పుడు స్టార్ హీరోయిన్, పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చారు.
- ప్రస్తుతం ఆమె సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా కాస్ట్యూమ్ మరియు మేకప్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు.
టాలీవుడ్ నటుడు ప్రసాద్ బాబు తన పుట్టినరోజు సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన కొడుకు శ్రీకర్, కోడలు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన ఆయన కోడలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం.
ప్రసాద్ బాబు వ్యక్తిగత జీవితం
HBD Prasad babu:టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రసాద్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుమారు 1500 చిత్రాలలో నటించిన ఆయన, తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, అందరూ స్వయంకృషితో ఎదిగారని తెలిపారు. ముఖ్యంగా తన కొడుకు శ్రీకర్ మరియు కోడలి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న తన కోడలు, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఏ రంగంలో రాణిస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు చూద్దాం..
ప్రసాద్ బాబు కుమారుడు శ్రీకర్ కన్నడ, తమిళ చిత్రాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లిజరిన్ వాడకుండానే ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించే శ్రీకర్ జాతకం సాక్షాత్తూ ఎన్టీఆర్ గారి జాతకంతో పోలి ఉంటుందని ప్రసాద్ బాబు గర్వంగా చెబుతారు. ఇక తన కోడలు కూడా తక్కువ కాదని, ఆమె ఒక అద్భుతమైన నటి అని ఆయన ప్రశంసించారు. ఇక ముఖ్యంగా సెంటిమెంట్ పాత్రలను పండించడంలో ఆమెకు సాటిలేరని ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బంగారం, ఢి వంటి తదితర తెలుగు చిత్రాలలో నటించింది, పెళ్ళయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల ఆమె నటనకు కాస్త విరామం ఇచ్చారని వివరించారు.
ఒకప్పుడు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తన కోడలు, ఇప్పుడు వెండితెరకు దూరమైనప్పటికీ ఇండస్ట్రీతో తనకున్న అనుబంధాన్ని మాత్రం తెంచుకోలేదు. ప్రస్తుతం ఆమె ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తోంది. కాస్ట్యూమ్ మరియు మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తూనే, సొంతంగా ఎన్నో సంస్థలను నడుపుతున్నట్లు ప్రసాద్ బాబు వెల్లడించారు. ఇక ఎవరిపైనా ఆధారపడకుండా తన సొంత వ్యాపారంలో ఆమె దూసుకుపోతుండటం చూస్తుంటే ముచ్చటేస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
నటుడిగా శ్రీకర్ గురించి ప్రసాద్ బాబు
ప్రసాద్ బాబు తన 65వ ఏట మంగళగిరిలో కొండల మధ్య ఒక అందమైన ఇల్లు కట్టుకున్నారు. ఎవరి సహాయం తీసుకోకుండా, కూలీలతో పాటు ఎండలో నిలబడి ఆ ఇంటిని నిర్మించారట. ఇప్పుడు ఆ ప్రాంతం రాజధానిగా మారడం తన అదృష్టమని ఆయన భావిస్తారు. అలాగే తన భార్య గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక షూటింగ్ సెట్స్‌కు తన భార్య స్వయంగా వండిన ఆహారాన్ని పంపేవారని, సత్యనారాయణ, మురళీ మోహన్ వంటి వారు ఆమె చేతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
స్టార్ హీరోయిన్ నుండి బిజినెస్ ఉమెన్ గా ప్రసాద్ బాబు కోడలు
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ సినిమా తర్వాత ప్రసాద్ బాబు మరే సినిమాలో నటించలేదు. ఇక అవకాశాలు అడుక్కోవడం ఇష్టం లేకనే తాను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకే రోజు ఆరు, ఏడు సినిమాల షూటింగ్‌లలో పాల్గొన్న బిజీ లైఫ్ నుండి ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇక తన పిల్లలు, కోడలు ఎవరి కాళ్ల మీద వారు నిలబడి సమాజంలో గౌరవంగా బతకడమే తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయమని ఈ సీనియర్ నటుడు మనసు విప్పి చెప్పారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ప్రసాద్ బాబు తన కుటుంబం గురించి గొప్పగా చెప్పడం, ముఖ్యంగా తన కోడలు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ కావడం ఎంతో గర్వంగా ఉంది. వారి కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

