|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

HBD Rajinikanth : తలైవా బర్త్ డే స్పెషల్.. రజనీకాంత్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు…!

Published: 12-12-2025, 12:48 AM
HBD Rajinikanth : తలైవా బర్త్ డే స్పెషల్.. రజనీకాంత్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు…!
  • సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
  • ఆయన ఆస్తుల అంచనా విలువ సుమారు రూ.430 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
  • నటనతో పాటు సినిమా నిర్మాణం, వివిధ పెట్టుబడుల ద్వారా కూడా సంపాదిస్తారు.
  • రెండు రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు తలైవా సంపాదన, ఆస్తుల విలువ, లగ్జరీ కార్లు, ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ వంటి ఆసక్తికర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

రజినీకాంత్ ఆస్తుల అంచనా విలువ ఎంత?

HBD Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్… ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ గా ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్న ఈయన కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఎక్కువే.. తెలుగులో ఎన్నో సినిమాల్లో రజినీకాంత్ నటించిన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. రజినీ వయసు మాత్రమే పెరిగింది. సినిమాలపై మక్కువ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నారు.. కుర్ర హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.. నేడు ఆయన పుట్టినరోజు.. రజిని పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. నేడు రజినీకాంత్ పుట్టినరోజు సందర్బంగా ఆయన ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి..? ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సూపర్ స్టార్ రజినీకాంత్ భారతదేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. నడకకే స్టైల్ నేర్పించే ఈ హీరో, దాదాపు 50 ఏళ్ల సినీ కెరీర్‌లో పలు భారతీయ భాషల్లో నటించి సినీ ఇండస్ట్రీకి విశేషమైన సేవలు అందించాడు.. ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని, అలుపెరగని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబర్ 12తో 75 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీస్, పొలిటీషియన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నాడు. ఈయన బర్త్ డే సందర్బంగా ఆయన సంపాదిందించిన ఆస్తులను చూస్తే.. సుమారు రూ.430 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.. సీనియర్ హీరో నటన ద్వారానే కాకుండా సినిమాలను నిర్మించడం, వివిధ వెంచర్లలో పెట్టబడులతో కూడా డబ్బు సంపాదిస్తాడని తెలుస్తుంది. చెన్నైలోనే రజినీకాంత్ నివసిస్తాడు. ఈయన వద్ద రెండు రోల్స్ రాయిస్ (ఘోస్ట్, ఫాంటమ్), మెర్సిడెస్ బెంజ్ జి వ్యాగన్, లంబోర్ఘిని ఉరస్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

ఒక్కో సినిమాకు తలైవా రెమ్యూనరేషన్

సూపర్ స్టార్ లగ్జరీ కార్ల కలెక్షన్

బెంగళూరులో మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించిన ఈ హీరో అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. తండ్రి పోలీసు కానిస్టేబుల్.. సినిమాల్లోకి రాకముందు ఒక కూలీగా, బస్ కండక్టర్ గా పనిచేశారు. కన్నడ పౌరాణిక నాటకాలతో కెరీర్ ప్రారంభించి, తమిళ దర్శకుడు కె బాలచందర్ దృష్టిలో పడ్డాడు, 1975లో అపూర్వ రాగంగల్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ నేను నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు.. ఇప్పటివరకు అయినా 170 సినిమాలకు పైగా చేశారు. రజినీకాంత్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రజనీకాంత్ నటించినందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు.. అందుకే రజిని నటించిన సినిమా థియేటర్లలో యావరేజ్ టాక్ ను అందుకున్న కూడా కలెక్షన్ల పరంగా భారీగానే వసూళ్లను అందుకుంటాయి. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 150 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఈమధ్య ఈయన రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని వార్తలు కూడా వినిపించాయి.. వాటిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.. రజినీ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. జైలర్ 2 లో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రజినీకాంత్ నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, పెట్టుబడిదారుడిగా కూడా భారీ సంపదను కూడబెట్టారు. సినీ రంగంలో దాదాపు 50 ఏళ్ల ప్రస్థానంలో, ఆయన కేవలం సినిమాల ద్వారానే కాకుండా వివిధ మార్గాల ద్వారా కూడా గణనీయమైన ఆస్తులను సంపాదించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.