|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె అవయవ మార్పిడి జోక్ అనుకుంటున్నారా.. మోహన్ లాల్ ఓటీటీ సినిమాపై కేరళ డాక్టర్ ఆగ్రహం!

Published: 22-09-2025, 1:14 AM
గుండె అవయవ మార్పిడి జోక్ అనుకుంటున్నారా.. మోహన్ లాల్ ఓటీటీ సినిమాపై కేరళ డాక్టర్ ఆగ్రహం!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కానీ, సినిమాలోని ఒక దృశ్యంపై కేరళ డాక్టర్ తీవ్ర విమర్శలు చేశారు. అవయవ మార్పిడిని తేలికగా చూపించారని ఆయన ఆరోపించారు.

Key Points

1

మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం సినిమా ఓటీటీలో విడుదలవుతోంది.

2

కేరళ డాక్టర్ హరీష్ చిరకల్ సినిమాలోని అవయవ మార్పిడి దృశ్యాలను విమర్శించారు.

4

అవయవ మార్పిడి ప్రక్రియ, దాని ప్రమాదాల గురించి సినిమాలో సరిగ్గా చూపించలేదని ఆయన అభిప్రాయం.

హృదయపూర్వం ఓటీటీ విడుదల

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా థ్రిల్లర్ హృదయపూర్వంలో హీరోయిన్ మాళవిక మోహనన్ , ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు. అలాగే, సంగీత మాధవన్ నాయర్, బసిల్ జోసెఫ్, మీరా జాస్మిన్, ఆల్తాఫ్ సలీమ్ తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు.

సత్యాన్ అంతికడ్ దర్శకత్వం వహించిన హృదయపూర్వం సినిమా ఆగస్ట్ 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 80 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాంటి హృదయపూర్వం ఓటీటీ లోకి వచ్చేయనుంది.

జియో హాట్‌స్టార్‌ లో సెప్టెంబర్ 26 నుంచి హృదయపూర్వం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మలయాళం, తెలుగుతో సహా ఐదు భాషల్లో హృదయపూర్వం ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హృదయపూర్వం మూవీపై కేరళకు చెందిన డాక్టర్ హరీష్ చిరకల్ విమర్శలు చేశారు.

డాక్టర్ హరీష్ చిరకల్ విమర్శలు

అయితే, కేరళ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో యూరాలజీ విభాగాధిపతి అయిన డాక్టర్ హరీష్ చిరకల్‌పై ఈ ఏడాది జూలైలో వార్తలు వచ్చాయి. సిస్టమ్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అది వైరల్ అయి కాంట్రవర్సీకి దారి తీసింది. దాంతో డాక్టర్ హరీష్‌పై షోకాజ్ నోటీస్ కూడా జారీ అయింది.

ఆ తర్వాత ప్యానెల్ నుంచి డాక్టర్ హరీష్‌కు క్లియరెన్స్ లభించింది. అలాంటి డాక్టర్ హరీష్ చిరాకల్ తాజాగా హృదయపూర్వం సినిమాపై విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సీరియస్ విషయమైన అవయవ మార్పిడిని ఎలాంటి జ్ఞానం లేకుండా చూపించారంటూ ఆయన విమర్శించారు.

“ఆ సినిమా అవయవ మార్పిడి జరగాల్సిన వ్యక్తిపై ఎలాంటి జాగ్రత్త చూపించలేదు. అంతా ఒక జోక్‌లా చూపించారు. రిసెప్షన్ నుంచి బంధువులు, జెనరల్ కమ్యూనిటీ వరకు అంతా తేలికగా తీసుకున్నారు. అలాంటి సీరియస్ విషయాన్ని కామెడీ, జోక్ చేయకూడదు” అని డాక్టర్ హరీష్ అన్నారు.

అవయవ మార్పిడి దృశ్యాలపై వివాదం

ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మనిషి శరీర పనితీరు గురించి ప్రస్తావించారు. కొన్నిసార్లు ఆ కొత్త అవయవాన్ని బాడీ రెజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. “అలాంటి పరిస్థితిపై కామెడీకి తావులేదు. అవయవ మార్పిడి తర్వాత ఆ పేషంట్‌కు ఇతరులు, జంతువుల నుంచి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అలాంటివి నిషేధం” అని హెచ్చరించారు.

“గుండెను రక్తం సరఫరా చేసే పంపులా చూస్తున్నారు కానీ మనసుగా చూడట్లేదు. ఇలాంటి సీన్లతో సీరియస్ విషయాలు ప్రజలకు జోకులా మారిపోతాయి. నేను సినిమా గురించి తప్పుగా చెప్పట్లేదు. దయచేసి ఇలాంటి వాటిని ఈజీగా తీసుకోకండి” అని వైద్యుడు హరీష్ హెచ్చరించారు.

“నాకు ఇష్టమైన డైరెక్టర్ సత్యాన్ అతికడ్, హీరో మోహన్ లాల్. ఎంతోమంది యంగ్‌స్టర్స్ నటించారు. సినిమా బాగుంది. కానీ, ఈ ఒక్కదాంతోనే నేను ఏకీభవించలేను” అని లాంగ్ నోట్ రాసుకొచ్చారు డాక్టర్ హరీష్ చిరకల్.

చివరగా, హృదయపూర్వం సినిమాలోని అవయవ మార్పిడి దృశ్యాలపై కేరళ డాక్టర్ వ్యక్తం చేసిన ఆగ్రహం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు స్పందించాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.