|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఈ రోజు నుంచి మేము ఒకరికొకరుగా జీవిస్తాము అంటూ ఎమోషనల్ పోస్ట్..

Published: 04-06-2025, 11:14 PM
ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఈ రోజు నుంచి మేము ఒకరికొకరుగా జీవిస్తాము అంటూ ఎమోషనల్ పోస్ట్..

ప్రముఖ బుల్లితెర నటి హీనా ఖాన్ తన ప్రియుడితో రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, ఎమోషనల్ పోస్ట్‌తో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

Key Points

1

బుల్లితెర హీరోయిన్ హీనా ఖాన్ రహస్య వివాహం

2

ప్రియుడు రాకీ జైస్వాల్‌తో జీవిత భాగస్వామి అయ్యింది

4

నెటిజన్ల నుండి శుభాకాంక్షలు వెల్లువ

హీనా ఖాన్ రహస్య వివాహం

బుల్లితెర హీరోయిన్ హీనాఖాన్(Heena Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ అనే సీరియల్ తెలుగులో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’గా డబ్ అయిన సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా వచ్చి అలరించింది. అయితే గత ఏడాది నుంచి హీనా ఖాన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి విదితమే. ఇక క్యాన్సర్‌తో తాను ఇబ్బంది పడుతున్న విషయాలను, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయాలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా హీనా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్రియుడు రాకీ జైస్వాల్‌ను వివాహం చేసుకుంది. ఇక తన పెళ్ళికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘రెండు వేర్వేరు ప్రపంచాలను కలపడం ద్వారా మనం ఒకే ప్రపంచాన్ని సృష్టించుకున్నాం. మేము మా మనోవేదనలన్నింటినీ చెరిపివేసి.. జీవితాంతం ఉండే సంబంధాన్ని ఏర్పరచుకున్నాము. మేము ఒకరికొకరు ప్రపంచం.. ఈ రోజు నుంచి మేము ఒకరికొకరుగా జీవిస్తాము’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తానెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఎమోషనల్ పోస్ట్‌తో సంతోషం పంచుకోవడం

నెటిజన్ల నుండి అభినందనలు

హీనా ఖాన్ తన కొత్త జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఆమె సోషల్ మీడియా పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆనందపరిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.