
ప్రముఖ నటి హెల్లీ షా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఓ సిరీస్ ఆఫర్‌లో భాగంగా అసభ్యకరమైన ప్రతిపాదన వచ్చిందని ఆమె వెల్లడించింది. ఈ ఘటన సినీ పరిశ్రమలో గల చీకటి వైపు కాంతిని పడేసింది.
Key Points
హెల్లీ షా కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది.
ఓ సిరీస్ ఆఫర్ కోసం అసభ్యకరమైన ప్రతిపాదన ఎదుర్కొంది.
ఫోన్‌లో అయినా అసభ్యంగా ప్రవర్తించాలని డిమాండ్ చేశారని తెలిపింది.
ఆ వ్యక్తి నెంబర్‌ను బ్లాక్ చేసింది.
హెల్లీ షా కాస్టింగ్ కౌచ్ అనుభవం
హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ ద్వారా తన నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ హెల్లీ షా. ఇప్పుడు ఈ అమ్మడు గుజరాతీ మూవీ ‘దేడ’తో వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హెల్లీ.. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ‘నాకు ఓ పెద్ద సిరీస్‌లో ఆఫర్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను అప్రోచ్ అవుతూ నాకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి.. కన్ఫర్మేషన్ కోసం నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని అడిగాను. దానికి వాళ్లు.. ‘అవును.. అందుకే మీకు మెసేజ్ చేశాం.
అసభ్యకరమైన ప్రతిపాదన
అయితే.. మీరు ఈ ప్రాజెక్టులో జాయిన్ అవ్వాలంటే మేము చెప్పిన ప్లేస్‌కు వచ్చి.. చెప్పింది చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ సొంతం’ అని రిప్లై ఇచ్చారు. దానికి నేను ‘మీరు వేరే వాళ్లను చూసుకోండి’ అని రిప్లై ఇచ్చారు. అయినా కూడా అవతల వ్యక్తి ‘మీరు రాకపోయినా పర్వాలేదు. కనీసం ఫోన్‌లో అయినా చెప్పింది చేయండి’ అన్నారు. దీంతో నాకు ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. చాలా కోపం వచ్చింది. ఇదంతా నాకు ఎందుకు అనిపించి ఆ వ్యక్తి నెంబర్ బ్లాక్ చేశాను’ అని తెలిపింది.
హెల్లీ షా స్పందన
A post shared by Helly Shah (@hellyshahofficial)
హెల్లీ షా తన అనుభవాన్ని బయటపెట్టడం ద్వారా, కాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలపై చర్చను ప్రేరేపించింది. ఇటువంటి అనుభవాలను ఎదుర్కొంటున్న వారికి ధైర్యం చెప్పేలా ఈ ఘటన ఉంది.


