|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హేమ సంచలన వ్యాఖ్యలు: మంచు లక్ష్మిని కోతి అన్నారా? అసలేం జరిగిందంటే!

Published: 09-03-2026, 12:05 PM
హేమ సంచలన వ్యాఖ్యలు: మంచు లక్ష్మిని కోతి అన్నారా? అసలేం జరిగిందంటే!
  • ‘లేచింది మహిళాలోకం’ మూవీ ట్రైలర్ విడుదల
  • ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నటీమణులను కోతులుగా అభివర్ణించిన హేమ
  • మార్చి 26న థియేటర్లలో విడుదల కానున్న సినిమా
  • హేమ వ్యాఖ్యలపై స్పందించిన మంచు లక్ష్మి

హేమ తాజాగా మంచు లక్ష్మి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘లేచింది మహిళాలోకం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అసలు హేమ ఏమన్నారంటే…

హేమ కామెంట్స్ వైరల్

Hema: టైటిల్ చూసి, నిజంగానే మంకీ అని మంచు లక్ష్మి‌ని హేమ అందని అనుకుంటారేమో.. వాస్తవానికి ఆమె అన్నది నిజమే కానీ, మంచు లక్ష్మి ఒక్కదాన్నే కాదు.. అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్, ఇంకా తనని కూడా కలుపుకుని హేమ ఈ మాట అన్నారు. బ్రిహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’ (Lechindi Mahila Lokam). దర్శకద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో వీరంతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన ఒక జంట (శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల) మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధాలు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లుగా ఉన్న వీరంతా తమ మాటలతో పొల్యూట్ చేయడం.. ఈ క్రమంలో జరిగే పరిణామాలు కాన్సెప్ట్‌తో.. ఒకవైపు థ్రిల్‌ ఇస్తూనే, మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా తెరకెక్కినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

‘లేచింది మహిళాలోకం’ మూవీ విశేషాలు

మార్చి 26న థియేటరల్లో విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని సన్‌స్టూడియో.. యూఎఫ్‌ఓతో కలిసి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్‌ (Lechindi Mahila Lokam Trailer)ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలోనే ఈ లేడీస్ అందరినీ హేమ మంకీస్‌తో పోల్చారు. ‘‘ట్రైలర్ చాలా బాగుంది కదా.. ఒక కోతి ఉంటేనే అల్లరి ఎంత ఉంటుందో అందరికీ తెలుసు.. అలాంటిది ఇంతమంది కోతులు ఉంటే అల్లరి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి. ఈ సినిమా ఎవరినీ హర్ట్ చేయకుండా, అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నాకు ఓ మంచి పాత్ర లభించింది. ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా దర్శకులు ఈ సినిమాను రూపొందించారు. మార్చి 26న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుతున్నాను’’ అని హేమ (Hema) ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మంకీస్ తో పోల్చిన హేమ

ఇక నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) మాట్లాడుతూ.. మేము చిన్న చినిమా చేసినా.. అద్భుతమైన సినిమా చేశామని చెప్పగలను. ముఖ్యంగా ఎప్పుడూ లేనిది ఈ సినిమాలో నేను కామెడీ విషయంలో రెచ్చిపోయా. ఫ్లోలో చాలా మార్పులు చేశాం.. దయచేసి సినిమాను సినిమాగానే చూడండి. సీరియస్ సబ్జెక్టును కామెడీగా చెప్తేనే వింటున్నారు. ఈ సినిమాను కేవలం ఆడవాళ్లందరూ చూస్తే చాలు. నిర్మాతలకు పెట్టిన డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు వచ్చేస్తాయి. ఇంత మంచి మహిళలతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రమోషన్స్‌లో చూపించిన బ్లూ డ్రమ్‌కు, మా సినిమాకు ఎటువంటి సంబంధం ఉండదు. ‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం. ఈ సినిమాను అంతా చూసి సక్సెస్ చేయండని కోరారు.

మొత్తానికి హేమ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ‘లేచింది మహిళాలోకం’ సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.