|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

12 కోట్ల విలువైన ఇళ్లు అమ్మి, లగ్జరీ కారు కొన్న హేమా మాలిని, ఆమె ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

Published: 02-09-2025, 12:14 PM
12 కోట్ల విలువైన ఇళ్లు అమ్మి, లగ్జరీ కారు కొన్న హేమా మాలిని, ఆమె ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని 12 కోట్ల విలువైన ఇళ్ళు అమ్మి లగ్జరీ కారు కొన్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఆస్తుల విలువ, ఆమె జీవిత విశేషాల గురించి ఈ కథనం తెలుసుకుందాం.

Key Points

1

హేమా మాలిని 12 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు అమ్మారు.

2

73.83 లక్షల విలువైన MG M9 కారు కొనుగోలు చేశారు.

4

సినిమాలతో పాటు, ప్రకటనలు, వ్యాపారాలు, అద్దెల ద్వారా ఆదాయం పొందుతున్నారు.

హేమా మాలిని ఆస్తుల వివరాలు

బాలీవుడ్  డ్రీమ్ గర్ల్ హేమామాలిని, సినిమాల్లో రాజకీయల్లో రాణించారు. ఆమె మధుర నుండి బిజెపి ఎంపీగా ఉన్నారు. రీసెంట్ గా హేమా మాలినీ రెండు లగ్జరీ  ఫ్లాట్లు అమ్మి కొత్త కారు కొన్నారు. మీడియా కథనాల ప్రకారం, 12 కోట్లకు 2 ఫ్లాట్లు అమ్మి, 73.83 లక్షల విలువైన MG M9 కారు కొన్నారు. దీంతో హేమామాలిని ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో  చర్చనీయాంశమయ్యారు.  విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న హేమా మాలిని  ఆస్తుల గురించి తెలుసుకుందాం.

MG M9 కారు కొనుగోలు

2024 లోక్‌సభ ఎన్నికల నామినేషన్ సమయంలో హేమామాలిని తన ఆస్తుల విలువ 123.6 కోట్లుగా ప్రకటించారు. ఆమెకు 122.19 కోట్ల ఆస్తులు, 1.42 కోట్ల అప్పులు ఉన్నాయి. సినిమాలకు దూరంగా ఉన్నా, ప్రకటనలు, వ్యాపారాలు, అద్దెల ద్వారా ఆదాయం పొందుతున్నారు. చెన్నై, ముంబై, పూణే, వృందావన్, జైపూర్ వంటి నగరాల్లో ఆమెకు ఆస్తులు ఉన్నాయి. హేమకు కార్లంటే ఇష్టం. మెర్సిడెస్ బెంజ్, ఆడి Q5, అల్కాజర్, మారుతి ఈకో వంటి కార్లు ఆమె వద్ద ఉన్నాయి.

రాజకీయ జీవితం

హేమామాలిని ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె చివరిగా 2020లో ‘షిమ్లా మిర్చి’ సినిమాలో నటించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. హేమ నటి, నిర్మాత, దర్శకురాలు, మంచి నృత్యకారిణి కూడా. 2003లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2003 నుండి 2009 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 2010లో బిజెపి జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మధుర నుండి గెలిచారు.

హేమా మాలిని సినిమా, రాజకీయ రంగాలలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ, జీవనశైలి చూస్తే ఆమె విజయం అర్థమవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.