
ప్రముఖ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ హేమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. తల్లి మరణంతో హేమ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రాజోలులో తల్లి పార్థీవ దేహం వద్ద హేమ బోరున విలపించింది.
Key Points
క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ తల్లి కోళ్ల లక్ష్మి 80 ఏళ్ళ వయసులో మృతి.
కిడ్నీ సంబంధిత సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆవిడ సోమవారం రాత్రి మరణం.
తల్లి మరణవార్త విని స్వగ్రామం రాజోలులో హేమ బోరున విలపించింది.
హేమ తల్లికి పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు నివాళులు అర్పించారు.
నటి హేమ తల్లి కన్నుమూత
Hema : లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్ లో అనేక సినిమాలతో పాపులారిటీ తెచ్చుకుంది హేమ. బిగ్ బాస్ లో పాల్గొని మరింత వైరల్ అయింది. ఇటీవల ఒక సంవత్సరం క్రితం రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంది అనే ఆరోపణలతో వైరల్ అవ్వడమే కాక అరెస్ట్ అయి జైలుకెళ్ళొచ్చింది.(Hema)
ఆ తర్వాత హేమ ఇకపై ఎక్కువగా సినిమాలు చేయను అని చెప్పి సినిమాలకు దూరమైంది. తాజాగా నటి హేమ తల్లి మరణించింది. గతంలో డ్రగ్స్ ఆరోపణల సమయంలో ఓ ఇంటర్వ్యూలో.. నేను జైలుకెళ్లడం చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది, అనారోగ్యానికి గురయింది అని తెలిపింది.
రాజోలులో తల్లి పార్థీవ దేహం వద్ద హేమ విలపన
హేమ తల్లి పేరు కోళ్ల లక్ష్మి. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆవిడ 80 ఏళ్ళ వయసులో మరణించారు. ఆవిడ సోమవారం (నవంబర్ 17వ తేదీ) రాత్రి ఆకస్మిక మరణం చెందారు. తల్లి మరణవార్త విని హేమ స్వగ్రామం రాజోలు వెళ్లారు. తల్లి పార్థీవ దేహాన్ని చూసి హేమ బోరున విలపించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు వైరల్ గా మారాయి.
సినీ ప్రముఖులు, అభిమానుల సంతాపం
హేమ సోదరుడు కోళ్ల శ్రీనివాస్ వద్ద రాజోలులో తన తల్లి ఉంటుంది. హేమ తల్లి అంత్యక్రియలు నేడు నిర్వహించారు. దీంతో పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు హేమ తల్లికి నివాళులు అర్పిస్తూ ఆమెకు సంతాపం తెలియచేస్తున్నారు. ఇక హేమ తన తల్లితో దిగిన పలు పాత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
హేమ తల్లి కోళ్ల లక్ష్మి అంత్యక్రియలు నేడు నిర్వహించారు. ఈ విషాద సమయంలో హేమకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. హేమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.


