|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Hema: నాగ చైతన్య చేస్తే ఒప్పు.. సమంత చేస్తే తప్పా.. ఆడదానికి డబ్బుందని అంటారా.. సామ్ రెండో పెళ్లిపై నటి హేమ కామెంట్స్

Published: 03-12-2025, 9:10 AM
Hema: నాగ చైతన్య చేస్తే ఒప్పు.. సమంత చేస్తే తప్పా.. ఆడదానికి డబ్బుందని అంటారా.. సామ్ రెండో పెళ్లిపై నటి హేమ కామెంట్స్
  • నటి హేమ తాజాగా సమంత రెండో పెళ్లిపై తన అభిప్రాయాలను వెల్లడించింది.
  • నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు లేని వివాదం సమంతపై ఎందుకని ప్రశ్నించింది.
  • ఆడదానికి డబ్బుందని టార్గెట్ చేయడం సరికాదని హేమ అభిప్రాయపడింది.
  • సమంత జీవితాంతం సంతోషంగా ఉండాలని, ఆమెకు తోడు అవసరమని హేమ కోరింది.

టాలీవుడ్ నటి హేమ, స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నప్పుడు లేని చర్చ, సమంత విషయంలో ఎందుకు వస్తుందని ఆమె ప్రశ్నించారు. ఆడదానికి డబ్బుందని టార్గెట్ చేయడం సరికాదని హేమ అభిప్రాయపడ్డారు.

సమంత రెండో పెళ్లిపై హేమ ఆసక్తికర వ్యాఖ్యలు

Hema: టాలీవుడ్ నటి హేమ(Hema) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గత కోనేళ్ళుగా ఆమె తెలుగు ఆడియన్స్ ను తన నటనతో మెప్పిస్తూ వస్తోంది. తాజాగా ఈ నటి ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది. పర్సనల్, ప్రెఫెష్నల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా రెండో పెళ్లి చేసుకున్న సమంత గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఆమె సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ..

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అఖండ సినిమాకు మరో సీక్వెల్.. “జై అఖండ” గురించి చెప్పేశారు..

నాగ చైతన్య vs సమంత: డబుల్ స్టాండర్డ్స్ పై ప్రశ్న

చాలా మంది కేవలం సమంత గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎవ్వరు ఇలాంటి కామెంట్స్ చేయలేదు. సమంత రెండో పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. కానీ, ఈ విషయంలో సమంతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధంకావడం లేదు. ఆడదానికి డబ్బుందని టార్గెట్ చేయడం ఏంటి అసలు. అది ఆ అమ్మాయి జీవితం. పెళ్లి చేసుకుంది. దానికి కంగ్రాట్స్ చెప్పల్సింది పోయి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు సమంతకు ఓ తోడు అవసరం. అది ఆరోగ్యం విషయంలో కావచ్చు, మానసికంగా కావచ్చు. సమంత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.

సమంతకు తోడు అవసరం: హేమ మద్దతు

అలాగే, నాగ చైతన్య కూడా మంచి వ్యక్తి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చింది హేమ. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నారు. తాజాగా ఆ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తు పెళ్లితో ఒక్కటయ్యారు. అటు సామ్ కి, ఇటు రాజ్ కి ఇది రెండో వివాహం.

మొత్తంగా, నటి హేమ సమంతకు మద్దతుగా నిలిచారు. సమంత సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఆమెకు తోడు అవసరమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.