|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరో, హీరోయిన్ మధ్య లవ్.. సీక్రెట్ బయటపెట్టిన నిర్మాత

Published: 05-07-2025, 7:33 AM
హీరో, హీరోయిన్ మధ్య లవ్.. సీక్రెట్ బయటపెట్టిన నిర్మాత

సుహాస్ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ తెలుగులో హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది.

Key Points

1

సుహాస్‌, మాళవిక మనోజ్‌ జంటగా ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా

2

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం

4

నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ విడుదల

డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్‌ (Suhas) నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama). మలయాళం బ్యూటీ మాళవిక మనోజ్ (Malavika Manoj) (జో ఫేమ్) ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వంలో.. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. దీంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, హీరో, హీరోయిన్స్‌ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్‌ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది.

సుహాస్‌, మాళవిక మనోజ్‌ ప్రేమకథ

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు ఈచిత్రం షూర్‌ షాట్‌ విజయం అంటుంటే ఆనందంగా ఉంది. క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రత సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. హీరో సుహాస్‌, మాళవిక మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ కూడా అలరించే విధంగా ఉంటాయి. సుహాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్త అనుభూతినిస్తుంది. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది’ అన్నారు.

సినిమా విడుదల తేదీ

దర్శకుడు రామ్ గోధల మాట్లాడుతూ.. ‘ఇటీవల విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఓ క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వడానికి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మాత హరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రొడక్ట్‌ క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.. మా సినిమాను అందరూ ఆదరించండి’ అని తెలిపారు.

సుహాస్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 11న విడుదలయ్యే ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.