|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ పై హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 10-12-2025, 4:48 PM
నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ పై హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • సినిమాల్లో నటీనటుల వయసు తేడాపై హీరో కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.
  • ప్రేక్షకులు వయసు తేడాల గురించి కాకుండా, పాత్రలను మాత్రమే చూడాలని కార్తీ విజ్ఞప్తి.
  • కార్తీ అభిప్రాయాలపై కొందరు మద్దతు తెలపగా, మరికొందరు వింతగా ఉందని వాదిస్తున్నారు.
  • కార్తీ, కృతిశెట్టి నటించిన ‘అన్నగారు వస్తారు’ సినిమా డిసెంబర్ 12న విడుదల.

సినిమాల్లో నటీనటుల మధ్య వయసు తేడాపై ఇటీవల జరుగుతున్న చర్చపై హీరో కార్తీ స్పందించారు. ప్రేక్షకులు కేవలం పాత్రలను మాత్రమే చూడాలని కోరారు. కార్తీ అభిప్రాయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఆయన కొత్త సినిమా ప్రమోషన్లలో చేశారు.

నటీనటుల ఏజ్ గ్యాప్ పై కార్తీ అభిప్రాయం

ఈ మధ్య సినిమాల్లో నటీనటులను చూస్తే.. ఆ హీరో పక్కన ఆమె హీరోయినా అని 100 మందిలో కనీసం 20 మందైనా చర్చించుకుంటారు. 50 ఏళ్ల హీరో పక్కన, పాతికేళ్ల వయసున్న హీరోయిన్ నటించడం ఏంటి? నిజజీవితంలో అయితే ఇలానే ఉంటారా అని చెవులు కొరుక్కుంటు ఉంటారు. తాజాగా ఈ విషయంపై హీరో కార్తీ స్పందించారు. అన్నగారు వస్తారు సినిమా ప్రమోషన్లలో పాల్గొన కార్తీ.. ఏజ్ గ్యాప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కార్తీ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

నటీనటుల మధ్య వయసు తేడాపై ఆందోళన చెందిత.. మనం సినిమాలు తీయడం మానేయాలన్నారు. ప్రేక్షకులు వయసు తేడా గురించి పట్టించుకోకుండా ఆ క్యారెక్టర్లను మాత్రమే చూడాలని కోరారు. కార్తీ చెప్పిన విషయాన్ని కొందరు యాక్సెప్ట్ చేసినా మరికొందరు మాత్రం.. తెరపై కనిపించే జంట మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే.. చూడటానికి వింతగా ఉంటుందని వాదిస్తున్నారు. ఈ చర్చ విభిన్న అభిప్రాయాలకు దారితీస్తూనే ఉంది.

అన్నగారు వస్తారు సినిమా విశేషాలు

అన్నగారు వస్తారు సినిమా నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా, కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కాబోతోంది.

సినిమాల్లో నటీనటుల మధ్య వయసు తేడాపై కార్తీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన అభిప్రాయాన్ని కొందరు అంగీకరించినా, మరికొందరు మాత్రం తెరపై వయసు తేడా ఇబ్బందికరంగా ఉంటుందని వాదిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.