|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరో రాజ్‌ తరుణ్‌ని వదలని ప్రియురాలు, మరో కేసు.. కారణం ఇదే

Published: 04-09-2025, 3:32 AM
హీరో రాజ్‌ తరుణ్‌ని వదలని ప్రియురాలు, మరో కేసు.. కారణం ఇదే

హీరో రాజ్ తరుణ్ పై ఆయన మాజీ ప్రియురాలు లావణ్య మరో కేసు నమోదు చేసింది. కుటుంబ సభ్యులపై దాడి, బంగారం దొంగతనం, పెంపుడు కుక్కను చంపడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

Key Points

1

హీరో రాజ్ తరుణ్ పై లావణ్య మరో కేసు నమోదు చేసింది.

2

కుటుంబ సభ్యులపై దాడి, బంగారం దొంగతనం ఆరోపణలు.

4

పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు.

లావణ్య చేసిన తాజా ఆరోపణలు

హీరో రాజ్‌ తరుణ్‌పై మరో కేసు నమోదైంది. గతంలో తన ప్రియురాలు లావణ్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనని పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు తనతో ఉండి, ఆ తర్వాత హ్యాండిస్తున్నాడని, మరో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని, తన వద్దకు రావడం లేదని, తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టింది. తనకు రాజ్‌ తరుణ్‌ కావాలని చెప్పింది. ఈ క్రమంలో తనపై దాడి చేశారంటూ ఆమె ఆరోపించింది. ఈ కేసు కోర్ట్ వరకు వెళ్లింది. రాజ్‌ తరుణ్‌, లావణ్యల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

ఇప్పుడు మరోసారి రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టింది లావణ్య. అయితే ఈ సారి రాజ్‌ తరుణ్‌ తమ కుటుంబ సభ్యులపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టింది. జూన్‌ 30న రాజ్‌ తరుణ్‌ తన అనుచరులతో కలిసి వచ్చి తమ ఫ్యామిలీ మెంబర్స్ పై దాడి చేశాడని, అలాగే బంగారం ఎత్తుకెళ్లాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ దాడిలో తన తండ్రి గాయాలపాలయ్యాడని వెల్లడించింది. అంతేకాదు తన పెంపుడు కుక్కని కూడా చంపారని ఫిర్యాదులో వెల్లడించింది లావణ్య.

రాజ్ తరుణ్, లావణ్యల మధ్య వివాదం

ఈ కేసు ఇన్నాళ్లని సీరియస్‌గా తీసుకోని పోలీసులు ఈ విషయం కాస్త సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వద్దకు వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు తాజాగా ఈ కేసుకి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారట. ప్రస్తుతం ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే రాజ్‌ తరుణ్‌, లావణ్యల మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో ఈ సారి ఈ కేసుని పోలీసులు కూడా కాస్త సీరియస్‌గానే తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. కాకపోతే రాజ్‌ తరుణ్‌ని మాత్రం లావణ్య ఇప్పట్లో వదిలేలా లేదని తెలుస్తోంది.

రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య వివాదం తీవ్రమైంది. ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి. పోలీసుల దర్యాప్తు ఫలితాలు ఎదురుచూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.