|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరో శ్రీకాంత్‌ ఫస్ట్ లవ్‌ స్టోరీ, పెళ్లి చేసుకోవాలనుకుంటే కాంపిటీషన్‌గా మరో ఫ్రెండ్‌.. త్యాగమూర్తి

Published: 05-11-2025, 9:11 PM
హీరో శ్రీకాంత్‌ ఫస్ట్ లవ్‌ స్టోరీ, పెళ్లి చేసుకోవాలనుకుంటే కాంపిటీషన్‌గా మరో ఫ్రెండ్‌.. త్యాగమూర్తి

హీరో శ్రీకాంత్ కెరీర్ తొలినాళ్లలో విభిన్న పాత్రలు పోషించి స్టార్‌గా ఎదిగారు. హీరోయిన్ ఊహతో ఆయన ప్రేమ వివాహం అందరికీ తెలిసిందే. అయితే, ఊహకు ముందు శ్రీకాంత్‌కు ఓ కాలేజీ లవ్‌స్టోరీ ఉంది. స్నేహితుడి కోసం ఆయన చేసిన త్యాగం ఆసక్తికరమైన మలుపు.

Key Points

1

హీరో శ్రీకాంత్ విలక్షణ నటుడిగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగారు.

2

హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 'ఆమె' సినిమాతో పరిచయం.

4

తన క్లాస్‌మేట్, స్నేహితుడి ప్రేమ కోసం శ్రీకాంత్ తన మొదటి ప్రేమను త్యాగం చేశారు.

శ్రీకాంత్ సినీ ప్రస్థానం: విలన్‌ నుంచి స్టార్‌ హీరో వరకు

హీరో శ్రీకాంత్‌ కెరీర్‌ ప్రారంభంలో క్యారెక్టర్స్, విలన్‌ పాత్రలు చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఫ్యామిలీ చిత్రాలతో ఇంటిళ్లిపాదిని అలరించారు. స్టార్‌ హీరోగా ఎదిగారు. మధ్య మధ్యలో `ఖడ్గం`, `ఆపరేషన్‌ దుర్యోదన`, `మహాత్మ` వంటి యాక్షన్‌ చిత్రాలు చేసి మెప్పించారు. మల్టీస్టారర్స్ కూడా చేశారు. చిరంజీవితో `శంకర్‌ దాదా` చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇలా విలక్షణ నటుడిగా మెప్పిస్తూ వచ్చారు శ్రీకాంత్‌. ఇప్పుడు కెరీర్‌ పరంగా టర్న్ తీసుకున్నారు. నెగటివ్‌ రోల్స్, బలమైన క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు.

ఇదిలా ఉంటే హీరో శ్రీకాంత్‌ హీరోయిన్‌ ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. `ఆమె` సినిమాతో ఇద్దరి మధ్య పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లింది. ఈ లవ్‌ స్టోరీ కంటే ముందే శ్రీకాంత్‌కి మరో లవ్‌ స్టోరీ ఉంది. ఆయన కాలేజీలోనే ఓ లవ్‌ స్టోరీ నడిపించారు. అయితే అప్పట్లో ఎక్కువగా వన్‌ సైడ్‌ లవ్‌లే ఉండేవి. ప్రేమించిన అమ్మాయికి ప్రేమని వ్యక్తం చేయడం పెద్ద సవాల్‌గా ఉండేది. చెప్పే ధైర్యం లేక మనసులోనే సమాధి అయ్యేది. శ్రీకాంత్‌ విషయంలోనూ అదే జరిగింది.

హీరోయిన్ ఊహతో ప్రేమ, పెళ్లి ప్రయాణం

శ్రీకాంత్‌ హీరో అవుతానని ఇంటర్‌లోనే ఇంటి నుంచి పారిపోయారు. మద్రాస్‌ వెళ్లి ఏవీఎం స్టూడియోకి వెళితే కనీసం గేట్‌ వద్దకు కూడా రానివ్వలేదు. దీంతో ఏం చేయాలో తోచక, తనకు జరిగిన అవమానంతో ఆ రోజు రాత్రంతా ఏడ్చాడు. ఆ మరుసటి రోజు ఇంటికి ఫోన్‌ చేయగా, పేరెంట్స్ ఏడుస్తున్నారని అక్క చెప్పింది. దీంతో మళ్లీ ఊరెళ్లిపోయారు. పేరెంట్స్ డిగ్రీ పూర్తి చేశాక సినిమాల్లోకి పంపిస్తామని చెప్పడంతో వారి కోరిక మేరకు డిగ్రీ చేశారు శ్రీకాంత్‌. ఆ డిగ్రీ సమయంలోనే ఓ అమ్మాయి ఆయనకు బాగా నచ్చింది. చాలా రోజులు ఆమెని చూస్తూ ఉన్నాడట. చెప్పే ధైర్యం లేక అలానే ఆరాధించారట. ఆమె ఓకే చెబితే పెళ్లి చేసుకోవాలనుకున్నారట.

శ్రీకాంత్‌ అన్నీ మనసులోనే అనుకున్నాడు. చెప్పాలి చెప్పాలి అనుకునే లోపు మరో క్లాస్‌ మేట్‌ వచ్చాడట. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఎలాగైనా మీరు హెల్ప్ చేయాలని శ్రీకాంత్‌నే అడిగాడట. తన ప్రేమ విషయాన్ని చెప్పకుండా, సరేరా హెల్ప్ చేద్దామని చెప్పారట. తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు శ్రీకాంత్‌. కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా ప్రేమిస్తున్నాడు అని ఆ అమ్మాయికి చెప్పగా సారీ అని చెప్పిందట. దీంతో శ్రీకాంత్‌ ఆనందానికి అవదుల్లేవ్‌. తనకు లైన్‌ క్లీయర్‌ కావడంతో లోలోపల ఎగిరి గంతేశాడట. అయితే ఆ అమ్మాయి ఎస్‌ చెప్పినా, నో చెప్పినా ఫ్రెండ్‌ పార్టీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. నో చెప్పడంతో మంచి పార్టీ ఇచ్చారట. శ్రీకాంత్‌ ఆనందంలో ఆ పార్టీని బాగా ఎంజాయ్‌ చేశాడట. కానీ ఆమెకి తన ప్రేమని వ్యక్తం చేయలేదని, చెప్పాలనుకునే లోపు డిగ్రీ అయిపోయిందని వెల్లడించారు శ్రీకాంత్‌. ఆ ప్రేమ మనసులోనే సమాధి అయిపోయిందన్నారు. యాంకర్‌ ప్రదీప్‌ నిర్వహించిన `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` టాక్‌ షోలో శ్రీకాంత్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.

త్యాగం చేసిన మొదటి కాలేజ్ ప్రేమకథ

హీరో శ్రీకాంత్‌ డిగ్రీ తర్వాత హైదరాబాద్‌లో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. అనంతరం 1991లో `పీపుల్స్ ఎన్‌కౌంటర్‌` చిత్రంతో నటుడిగా మారారు. ఇందులో నక్సలైట్‌గా నటించారు. ప్రారంభంలో అనేక డిఫరెంట్‌ రోల్స్ చేశారు, సెకండ్‌ లీడ్‌, విలన్‌, కొన్ని సినిమాల్లో హీరోగా చేసుకుంటూ వచ్చారు. ఇరవై సినిమాల తర్వాత బ్రేక్‌ వచ్చింది. `ఆమె`తో హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయారు. `ఆమె` చిత్రంతోనే  హీరోయిన్‌ ఊహతో ప్రేమలో పడి, ఆమెని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరిలో ఇద్దరు కుమారులు రోషన్‌, రోహన్‌, కూతురు మేధా ఉన్నారు. రోషన్‌ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు `ఛాంపియన్‌` చిత్రంతో రాబోతున్నాడు.

శ్రీకాంత్ వ్యక్తిగత జీవితంలో తన మొదటి ప్రేమను త్యాగం చేసిన వైనం ఆయనలోని గొప్ప గుణాన్ని తెలియజేస్తుంది. సినీ కెరీర్‌తో పాటు నిజ జీవితంలోనూ ఎన్నో అనుభవాలను చూసిన శ్రీకాంత్ ప్రస్థానం ఆదర్శప్రాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.