|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దాంపత్య జీవితంలో తుఫాన్! 26 ఏళ్ల వైవాహిక బంధానికి వీడిన ముడి! కారణం అదేనా?

Published: 27-02-2026, 7:35 AM
విజయ్ దాంపత్య జీవితంలో తుఫాన్! 26 ఏళ్ల వైవాహిక బంధానికి వీడిన ముడి! కారణం అదేనా?
  • విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు, వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
  • 26 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
  • నటి త్రిషతో విజయ్ రిలేషన్ కారణంగానే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
  • గత కొంతకాలంగా సంగీత, విజయ్‌తో కలిసి ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సంగీత స్వయంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. 26 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకనున్నారు.

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగీత

Hero Vijay Divorce: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న అంశం ఇటీవల కాలంలో విడాకుల పరంపర మరి కాస్త ఎక్కువగా జరుగుతుంది. ఒకప్పుడు పెళ్లయిన వెంటనే విభేదాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయేవారు అయితే ఇటీవల పెళ్లి జరిగి పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చినప్పుడు కొంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లయిన 18 సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే బాటలో మరొక జంట కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విజయ్ (Vijay)థలపతి ఒకరు. సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన ఇటీవల రాజకీయ పార్టీని కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీ అధినేతగా విజయ్ ప్రస్తుతం రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్నారు అయితే గత కొంతకాలంగా ఈయన తన భార్య సంగీత(Sangeetha) విడాకులు(Divorce) తీసుకొని విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఈ జంట మాత్రం ఎక్కడ స్పందించలేదు.

త్రిషతో ఎఫైర్ రూమర్లే కారణమా?

ఇకపోతే తాజాగా విజయ్ వైఫ్ సంగీత విడాకుల కోరుతూ చంగల్ పట్టు కోర్టును ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేశారు. త్వరలోనే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈమె విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలను నిజం చేయబోతున్నారనే చెప్పాలి. ఇక వీరిద్దరికీ 1999లో ఎంతో ఘనంగా వివాహం జరిగింది .ఈ దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇలా పెళ్లయిన 26 సంవత్సరాలకు విడాకులు కోరడం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయ్యింది.

నటి త్రిషతో రిలేషనే కారణమా?

26 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు

సంగీత గత కొంతకాలంగా విజయ్ తో కలిసి ఎక్కడ బయట కనిపించిన సందర్భాలు లేవు. తన భర్త రాజకీయ ప్రచార కార్యక్రమాలలో కూడా ఈమె కనిపించలేదు. దీంతో విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి అంతేకాకుండా నటుడు విజయ్ త్రిష రిలేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తల కారణంగానే విజయ్ కు సంగీత దూరం కాబోతోదంటూ గతంలో ఎన్నో రూమర్లు బయటకు వచ్చాయి అయితే ఈ రూమర్లు నిజం కావడంతోనే సంగీతం విడాకులు కోరారా? అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి సంగీత విజయ్ 26 ఏళ్ల వైవాహిక బంధం నుంచి విడిపోవాలనుకోవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

మొత్తానికి విజయ్, సంగీత విడాకుల వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. దీనిపై వారిద్దరూ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.