|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అబ్బాయిలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్.. ప్రపోజ్ చేయగానే !

Published: 07-07-2025, 7:26 AM
అబ్బాయిలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్.. ప్రపోజ్ చేయగానే !

తెలుగు సినిమా నటి వర్ష బొల్లమ్మ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అనేక మంది ఆమెను ప్రపోజ్ చేశారని, తన స్పందన ఎలా ఉంటుందో చెప్పింది.

Key Points

1

వర్ష బొల్లమ్మ తనకు అనేక ప్రపోజల్స్ వచ్చాయని వెల్లడించారు.

2

ప్రతి ప్రపోజల్‌కు వెంటనే స్పందిస్తానని, నో అంటే నో అని స్పష్టంగా చెబుతానని తెలిపారు.

4

ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వర్ష బొల్లమ్మ ప్రపోజల్స్ గురించి

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే కానీ అందులో.. కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) ఒకరు. మన తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చలన చిత్రాలలో కూడా… ఈ అందాల తార వర్ష నటించారు. 2015 సంవత్సరంలో తమిళ ఇండస్ట్రీలో సతురన్ అనే సినిమాతో.. వెలుగులోకి వచ్చారు.

ఆమె స్పష్టమైన సమాధానం

కర్ణాటక కు చెందిన ఈ అందాల తార… తెలుగులో కూడా సినిమాలు తీశారు. 2019 సంవత్సరంలో వచ్చిన చూసి చూడంగానే సినిమాతో… తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ తర్వాత జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. పుష్పక విమానం సినిమాలో అతిధి పాత్ర చేసి కనువిందు చేశారు. అయితే అలాంటి వర్ష బొల్లమ్మ తాజాగా నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో మెరిశారు.

సోషల్ మీడియాలో వైరల్

అయితే ఈ సినిమా సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వర్ష బొల్లమ్మ. తనకు చాలామంది ఇప్పటికే ప్రపోజ్ చేశారని వివరించారు. అయితే ప్రపోజ్ చేయడం తప్పు కాదని… ప్రపోజ్ చేసిన వెంటనే తాను నో… చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. వెంటనే మనం ప్రపోజ్ చేసిన వాళ్లకు సమాధానం ఇస్తే… అవతలి వ్యక్తి లైఫ్ కూడా బాగుంటుందని ఆమె కామెంట్ చేశారు. నచ్చితే నచ్చింది అని చెప్పాలి లేకపోతే లేదని అప్పుడే చెప్పేస్తే ఎలాంటి బాధ ఉండదని కూడా ఆమె వివరించారు. దీంతో వర్ష చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

వర్ష బొల్లమ్మ ప్రపోజల్స్‌కు తన స్పష్టమైన స్పందనతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె అభిప్రాయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.