|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్ హీరోయిన్లు సైడ్ క్యారెక్టర్లు చేశారా? షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!

Published: 06-05-2026, 1:16 AM
స్టార్ హీరోయిన్లు సైడ్ క్యారెక్టర్లు చేశారా? షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!
  • సాయి పల్లవి ‘ఫిదా’ ముందు సైడ్ యాక్టర్‌గా నటించిందని చాలామందికి తెలియదు.
  • ‘హనుమాన్’ హీరోయిన్ అమృత అయ్యర్ కూడా కెరీర్ మొదట్లో సైడ్ రోల్స్ చేసింది.
  • ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది.
  • చాలామంది హీరోయిన్లు చిన్న పాత్రలతో మొదలై ఇప్పుడు స్టార్‌డమ్ అందుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్లలో నటించారని మీకు తెలుసా? సాయి పల్లవి, అమృత అయ్యర్, మమితా బైజు వంటి తారలు తమ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారో, ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో ఈ కథనంలో చూద్దాం.

సాయి పల్లవి: డాన్సర్ నుండి స్టార్ హీరోయిన్ వరకు

Tollywood :  సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే కచ్చితంగా ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ అవసరం.. ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ల ద్వారా అడుగుపెట్టి తమ టాలెంట్ తో వరుసగా సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటు వస్తున్నారు. అని కొంతమంది స్టార్స్ మాత్రం తమ టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కష్టపడిన వాడికి ఫలితం దక్కకుండా పోదు అన్నది ఎంత నిజమో అలాగే ఆ స్టార్స్ ఇప్పుడు పాన్ఇండియా హీరోలుగా, హీరోయిన్గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు సైడ్ క్యారెక్టర్ లో నటించారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మరి ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. డాన్సర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి ఫిదా మూవీతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని అందరూ అనుకున్నారు. తనకి ఆమె హీరోయిన్ గా కన్నా ముందు సైడ్ యాక్టర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ముందుగా ప్రేమం సినిమాలో ఆమెను హీరోయిన్గా చేయమని అడిగారట. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ అలాగే హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

అమృత అయ్యర్, మమితా బైజుల ఆశ్చర్యకర ప్రస్థానం

హనుమాన్ మూవీ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఈ సినిమా కన్నా ముందు పలు సినిమాలలో నటించింది. కెరియర్ స్టార్టింగ్ లో సైడ్ క్యారెక్టర్ లో నటించిన ఈమె ప్రస్తుతం హీరోయిన్గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు హీరోయిన్ మమతా బైజు అందరికీ తెలిసే ఉంటుంది.. ఈ సినిమా కన్నా ముందు మమత చాలా సినిమాలలో నటించింది. స్టార్ హీరోల సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లో కనిపించింది.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.. ప్రస్తుతం మలయాళం, తమిళ అలాగే తెలుగులో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా ఈమె నటించిన జన నాయగన్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది..

సైడ్ క్యారెక్టర్ల నుండి స్టార్‌డమ్ వైపు

వీళ్లే కాదు చాలామంది హీరోయిన్లు కెరియర్ స్టార్టింగ్ లో పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లో నటించి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరంతా కూడా స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారు. నటనలో మాత్రమే కాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నారు.. ఇప్పుడు హీరోయిన్లుగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.. కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరోలు కూడా కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి ప్రస్తుతం స్టార్ హీరోలుగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు..

మొత్తంగా, సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన హీరోయిన్లు చిన్న పాత్రలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించి, తమ కృషి, పట్టుదలతో స్టార్‌డమ్ సాధించారు. ఇది వారి అంకితభావానికి, నైపుణ్యానికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.