|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్: హైకోర్టు సంచలన తీర్పు!

Published: 10-04-2026, 3:05 AM
మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్: హైకోర్టు సంచలన తీర్పు!
  • విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్ బాబుపై హైకోర్టులో విచారణ జరిగింది.
  • విచారణ పూర్తయ్యే వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు.
  • మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాల ఆందోళనలు.
  • విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేశారని మోహన్ బాబుపై కేసు నమోదు.

మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మోహన్ బాబుకు హైకోర్టు ఊరట

Mohan Babu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, కలెక్షన్ కింగ్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు మోహన్ బాబు (Mohan Babu).ఇకపోతే ఆయన సినిమాల ద్వారా ఇటు విద్యాసంస్థల అధినేతగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన గత కొంతకాలంగా వివాదాలలో చిక్కుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం క్రితం విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసి నిర్బంధించిన విషయంలో మోహన్ బాబు పై కేసు ఫైల్ అయింది. అయితే తాజాగా దీనిపై హైకోర్టులో విచారణ జరపగా.. మోహన్ బాబుకు ఏపీ హైకోర్టు భారీ ఊరటను కలిగించింది. ముఖ్యంగా కోర్టు తదుపరి విచారణ జరిపే వరకు మోహన్ బాబుపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులను మోహన్ బాబు కిడ్నాప్ చేయించడంతోపాటు నిర్బంధించి, బెదిరించాడని ఆయనపై కేసు ఫైల్ చేశారు. దీంతో విద్యార్థి నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు పై కేసు ఫైల్ అయిన నేపథ్యంలో ఆయన బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరపగా.. ఇరువురి వాదనలు విన్న కోర్టు మోహన్ బాబుకు భారీ ఊరటను కలిగిస్తూ.. ఈ విధంగా పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన సీడీను కూడా కోర్టు ముందు ఉంచాలని వారికి స్పష్టం చేసింది. మరి దీనిపై హైకోర్టు తదుపరి విచారణలో ఏం వెల్లడించనుంది అనే విషయం ఉత్కంఠ గా మారింది.

విద్యార్థి సంఘాల ఆందోళనలు

కేసు వివరాల్లోకి వెళితే…

ఇక విద్యార్థికి సంఘాల నాయకులు ఆందోళనకు దిగడానికి గల కారణం ఏమిటి అంటే? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో మోహన్ బాబు యూనివర్సిటీ ద్వారా వేల మంది విద్యార్థులు తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ యూనివర్సిటీలో యాజమాన్యం మాత్రం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి. అయితే ఇలా ధర్నా చేస్తున్న సమయంలోనే విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్ లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు కిడ్నాప్ చేసి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం వారిని నిర్బంధించి బెదిరించారు కూడా.. ఈ విషయమై విద్యార్థి సంఘం మరో నేత తిరుపతి పోలీస్ లను ఆశ్రయించగా.. నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బౌన్సర్ల అధీనంలో ఉన్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించగలిగారు . అంతే కాదు బౌన్సర్లతో పాటు వారి వాహనాలను కూడా సీజ్ చేసి తిరుపతి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో పాటు ఈ వ్యవహారంలో భాగమైన వాళ్లందరిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇక ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విచారణ ఇప్పుడు హైకోర్టులో జరుగుతోంది .. మరి తదుపరి తీర్పు హైకోర్టు ఏ విధంగా ఇస్తుందో చూడాలి.

హైకోర్టు తీర్పు మోహన్ బాబుకు తాత్కాలిక ఊరటనిచ్చింది. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ కేసు రాజకీయంగా మరియు విద్యాపరంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.