|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హిలేరియ‌స్‌గా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్.. పాతిపెట్టడానికి స్మశానం లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు..

Published: 19-06-2025, 6:25 AM
హిలేరియ‌స్‌గా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్.. పాతిపెట్టడానికి స్మశానం లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు..

కీర్తి సురేష్ మరియు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. స్మశానం నిండిపోవడం వల్ల గ్రామస్తులు ఎదుర్కొనే వినోదాత్మక సమస్యను చిత్రం చూపుతుంది.

Key Points

1

కీర్తి సురేష్, సుహాస్ నటించిన 'ఉప్పు కప్పురంబు' ట్రైలర్ విడుదల

2

స్మశానం నిండిపోవడంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న విచిత్ర సమస్య

4

జులై 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఉప్పు కప్పురంబు ట్రైలర్ విడుదల

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh), హీరో సుహాస్(Suhas) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’(Uppu Kappurambu). ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సెటైరికల్ కామెడీ డ్రామాను రాధికా ఎల్ నిర్మించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో జులై 4 నుంచి తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

ఇక ట్రైల‌ర్‌ను చూస్తుంటే.. అమాయకురాలైన కీర్తి సురేష్.. వాళ్ల నాన్న చ‌నిపోవ‌డంతో గ్రామ పెద్దగా అధికారం చేప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే ఆ గ్రామానికి ఒక వింత సంక్షోభం వ‌స్తుంది. ఊరిలో ఉన్న స్మశానంలో జ‌నాలు చ‌నిపోయి హౌజ్‌ఫుల్‌గా మారుతుంది. దీంతో ఇంకా నలుగురు చ‌నిపోయి పూడ్చి పెట్టేంతా స్థ‌లం మాత్ర‌మే మిగిలి ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌ను గ్రామ‌స్థులు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఈ సినిమా క‌థ‌. ఫైనల్‌గా ఎంతో ఫన్‌గా ఈ ట్రైలర్ సాగింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్‌ను చూసేయండి.

స్మశానం సమస్య

కామెడీ డ్రామా

చివరిగా, ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు. జులై 4 నుండి అమెజాన్ ప్రైమ్ లో చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.