|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Himanshu Rao : విజయ్ దేవరకొండ అదరగొట్టాడు.. ‘కింగ్డమ్’ సినిమాపై కేటీఆర్ తనయుడి రివ్యూ..

Published: 31-07-2025, 7:54 AM
Himanshu Rao : విజయ్ దేవరకొండ అదరగొట్టాడు.. ‘కింగ్డమ్’ సినిమాపై కేటీఆర్ తనయుడి రివ్యూ..

Key Points

1

కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు 'కింగ్డమ్' సినిమా చూశారు.

2

హిమాన్షు సినిమాలో విజయ్ దేవరకొండ నటనను ప్రశంసించారు.

3

ఆడియన్స్ రెస్పాన్స్, థియేటర్ అనుభవం అద్భుతంగా ఉన్నాయని హిమాన్షు పేర్కొన్నారు.

కింగ్డమ్ సినిమాపై హిమాన్షు రావు అభిప్రాయం

Himanshu Rao : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా నేడు రిలీజయింది. థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా మిశ్రమ రివ్యూలు తెచ్చుకుంటుంది. విజయ్, సత్యదేవ్ తమ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు. అనిరుధ్ తన సంగీతంతో సినిమాని నిలబెట్టాడు. ఇప్పటికే సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో సినిమా గురించి మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలో కేటీఆర్ తనయుడు హిమాన్షు కింగ్డమ్ సినిమాను చూసాను అంటూ ట్వీట్ చేసాడు. హిమాన్షు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో కింగ్డమ్ సినిమా చూసాడు.

విజయ్ దేవరకొండ నటనపై ప్రశంసలు

హిమాన్షు తన ట్వీట్ లో.. ఇప్పుడే RTC క్రాస్ రోడ్స్ లో కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి కింగ్డమ్ సినిమా చూసాను. థియేటర్ లో రెస్పాన్స్ అదిరిపోయింది. ఆడియన్స్, థియేటర్ అనుభవం, స్క్రీన్ మీద ఎనర్జీ.. ఇవన్నీ కలిసి గూస్ బంప్స్ ఇచ్చాయి. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. సినిమా నచ్చింది అని తెలిపాడు.

థియేటర్ అనుభవం గురించి హిమాన్షు వ్యాఖ్యలు

మొత్తం మీద, కింగ్డమ్ సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. హిమాన్షు రావు సినిమాను ఆస్వాదించి, విజయ్ దేవరకొండ నటనను ప్రశంసించడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.