
బాలీవుడ్ చిత్రం హౌస్ ఫుల్ 5 లోని ‘లాల్ పరి’ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. 24 గంటల్లో 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించి, హనీ సింగ్ తిరిగి వచ్చాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాట హనీ సింగ్ మరియు సిమర్ కౌర్ లు ఆలపించారు.
Key Points
హౌస్ ఫుల్ 5 సాంగ్ 'లాల్ పరి' యూట్యూబ్ లో 24 గంటల్లో 2.1 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.
హనీ సింగ్, సిమర్ కౌర్ లు ఆలపించిన ఈ పాట రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందింది.
హనీ సింగ్ ఈ పాటకు స్వయంగా లిరిక్స్ రాశాడు.
ఫ్యాన్స్ హనీ సింగ్ తిరిగి వచ్చినందుకు పండుగ చేసుకుంటున్నారు.
లాల్ పరి సాంగ్ యూట్యూబ్ రికార్డులు
బాలీవుడ్ కొత్త ఫిల్మ్ హౌస్ ఫుల్ 5 చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘లాల్ పరి’ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ పార్టీ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ తో ర్యాప్ స్టార్ యోయో హనీ సాంగ్ పేరు మార్మోగుతోంది. ఈ పాటను రాయడమే కాకుండా హనీ సింగ్ పాడాడు కూడా. దీంతో హనీ సింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
హౌస్ ఫుల్ 5 నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ‘ లాల్ పరి ’ వీడియో యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. మే 3న ఈ పాటను విడుదల చేశారు మేకర్స్. ఇంటర్నెట్లో ఇన్ స్టంట్ హిట్ అయిన ఈ పాట కేవలం 24 గంటల్లో 21 మిలియన్ల (2.1 కోట్ల)కు పైగా వ్యూస్ సాధించింది. అల్ఫాజ్ తో కలిసి హనీ సింగ్ ఈ పాటకు స్వయంగా లిరిక్స్ రాశాడు. ఈ సాంగ్ ను హనీ సింగ్, సిమర్ కౌర్ ఆలపించారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సాంగ్ కు రెమో డిసౌజా కొరియోగ్రాఫర్.
‘లాల్ పరి’ సాంగ్ లో హనీ సింగ్ ర్యాప్ తో పాటు మత్తెక్కించేలా సిమర్ కౌర్ వాయిస్ ఉంది. ఆమె వాయిస్ మెస్మరైజ్ చేస్తోంది.
హనీ సింగ్ యొక్క తిరిగి రాక
‘‘ యూట్యూబ్ లో 24 గంటల్లో 21 మిలియన్ల వ్యూస్ తో ఇది హౌస్ ఫుల్ వ్యూస్! లాల్ పరి సాంగ్ పై చూపిస్తున్న మీ ప్రేమకు ధన్యవాదాలు. 2025 జూన్ 6న మీ దగ్గర్లోని థియేటర్లలో హౌస్ ఫుల్ 5 రిలీజ్ అవుతుంది’’ అని టీ సిరీస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
అక్షయ్ కుమార్ , అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన హౌస్ ఫుల్ 5 మూవీకి తరుణ్ మన్సుఖానీ డైరెక్టర్. సూపర్ హిట్ కామెడీ ఫ్రాంఛైజీ హౌస్ ఫుల్ సిరీస్ లో భాగంగా ఈ మూవీ వస్తోంది. సాజిద్ నదియాడ్ వాలా నిర్మించిన హౌస్ ఫుల్ 5 జూన్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ లాల్ పరి వీడియో సాంగ్ లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, సౌందర్య శర్మ తమ డ్యాన్స్ మూవ్స్ తో రచ్చ లేపారు.
ఫ్యాన్స్ ప్రతిస్పందన
లాల్ పరి సాంగ్ తో హనీ సింగ్ మరోసారి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా నిలిచాడు. ఆ నెంబర్ ‘జబర్దస్త్ వైబ్’ను అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘బ్రో బాలీవుడ్ సంగీతాన్ని ఒంటిచేత్తో పునరుద్ధరిస్తున్నాడు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘బ్లూటూత్ శకం తిరిగి వచ్చింది’ అని మరో అభిమాని రాశాడు. “హనీ సింగ్ యొక్క 2013 శకం తిరిగి వచ్చింది” అని మరొకరు పేర్కొన్నారు.
‘ఇది నాకు నోస్టాల్జియాను ఇచ్చింది. పాత హనీ సింగ్ ప్రకంపనలు’, ‘ఓల్డ్ హనీ ఈజ్ బ్యాక్’ అని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన పాట పదేపదే వింటున్నప్పుడు బాల్యం గుర్తుకొస్తుందని పేర్కొంటుననారు. అంతేకాకుండా మే 1న విడుదలైన అజయ్ దేవగణ్ రైడ్ 2 సినిమాలో మనీ మనీ అనే పాటకు కూడా హనీ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ పాటకు 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
హనీ సింగ్ యొక్క ‘లాల్ పరి’ సాంగ్ అద్భుతమైన విజయం సాధించింది. ఇది హౌస్ ఫుల్ 5 సినిమాకు మంచి ప్రచారాన్ని తీసుకువచ్చింది. ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.


