
గ్రహాల కదలికల వల్ల ఏర్పడే యోగాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. అక్టోబర్ 7న బుధుడు యముడుతో కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ అద్భుతమైన యోగం రాబోయే పదిహేను రోజులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలను అందించి, వారి జీవితాన్ని మారుస్తుంది.
Key Points
బుధుడు అక్టోబర్ 7న యముడుతో కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.
ఈ యోగం నాలుగు రాశుల వారికి 15 రోజుల పాటు శుభ ఫలితాలను ఇస్తుంది.
వృషభ, కర్కాటక, తుల, మకర రాశుల వారికి ధన లాభం, విజయం, గౌరవం లభిస్తాయి.
పెళ్లి కాని వారికి వివాహ యోగాలు, కొత్త అవకాశాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కేంద్ర యోగం ఎలా ఏర్పడుతుంది?
గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో మంచి శుభ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీంతో చాలా రాశుల వారి జీవితమే మారిపోతుంది. ఈ యోగం 15 రోజులు పాటు ఉంటుంది. దీంతో నాలుగు రాశుల వారి జీవితం ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది. ఎంతటి కష్టాల్లో ఉన్న బయటపడిపోవచ్చు. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
జ్యోతిష్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ప్రస్తుతం బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 3 అంటే ఈరోజు తులా రాశిలోకి ప్రవేశించాడు. దీంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడనుంది. అక్టోబర్ 7న బుధుడు యముడుతో కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
ఇది నాలుగు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. అక్టోబర్ 24న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. సక్సెస్‌ని కూడా అందుకుంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనేక విధాలుగా మీకు ప్రయోజనాలు కలుగుతాయి
ఈ యోగం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం?
కేంద్ర యోగంతో ఈ రాశుల వారి అదృష్టమే మారిపోతుంది.. జీవితంలో అనేక లాభాలను పొందుతారు
వృషభ రాశి వారికి కేంద్ర దృష్టి యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. వ్యాపారం కోసం లోన్ తీసుకోవడానికి చూస్తున్న వారికి ఇది బాగుంటుంది. సక్సెస్‌ని కూడా అందుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కర్కాటక రాశి వారికి కూడా ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి వలన అనేక విధాలుగా మీకు ప్రయోజనాలు కలుగుతాయి.
కేంద్ర యోగంతో లభించే శుభ ఫలితాలు
తులా రాశి వారికి కేంద్ర యోగం బాగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా పెరుగుతుంది. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
మకర రాశి వారికి కేంద్ర యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. అదృష్టం మీతోనే ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కేంద్ర యోగం యొక్క ఈ శుభ ప్రభావాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఆర్థిక లాభాలను, నూతన అవకాశాలను అందిస్తాయి. గ్రహాల అనుకూలతతో ఈ పదిహేను రోజులు వారి జీవితంలో గొప్ప సానుకూల మార్పులను తీసుకువస్తాయి.


