
📌 Key Points
- నయనతార కండిషన్లకు అంగీకరిస్తేనే ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
- అనిల్ రావిపూడి నయనతారను ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు.
- చిరంజీవి అడగడంతో నయనతారను ఒప్పించిన విధానం గురించి అనిల్ వెల్లడించారు.
- జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ఒప్పించడం అంత సులువు కాదు. అయితే అనిల్ రావిపూడి ఆమెను ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. ఆసక్తికరమైన విషయాలను చిరంజీవి అడిగి తెలుసుకున్నారు.
నయనతారను ఒప్పించడం అంత సులువా?
MSVPG Movie: సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న నయనతార (Nayanthara)ను ఒక సినిమాలో ఒప్పించడం అంటే అంత ఆషామాషీ కాదు. ముఖ్యంగా ఆమె పెట్టే కండిషన్స్ అన్నింటికీ కూడా దర్శకనిర్మాతలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సినిమా విడుదలవుతోంది అంటే ఆమె సినిమా ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరుకాదు.. ఇలా ఎన్నో నిబంధనలను దర్శక నిర్మాతలు ఓకే చేస్తేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే అలాంటి ఆమె చేతనే ప్రమోషన్స్ చేయించి అందరిని ఆశ్చర్యపరిచారు అనిల్ రావిపూడి (Anil ravipudi). అయితే ఈ సినిమాలో ఆమెను ఒప్పించడానికి అనిల్ ఏం చేశారు? అనే విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) అడగడంతో అనిల్ రావిపూడి చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు సునామి కురిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా అనిల్ రావిపూడితో.. నయనతారతో ప్రమోషన్స్ చేయించావు.. ఇది ఎలా కుదిరింది ? అని చిరంజీవి అడగగా అనిల్ రావిపూడి ఇలా సమాధానం ఇచ్చారు.
అనిల్ రావిపూడి ప్రయత్నాలు ఏంటి?
ఇకపోతే అనిల్ రావిపూడి మాట్లాడుతూ..” ఈ సినిమాలో నయనతారను తప్ప మరొకరిని నేను ఊహించుకోలేను. ముఖ్యంగా హీరోకి దీటుగా.. హీరో స్థాయికి పోటీగా.. అంతే పొగరుగా నిలబడే హీరోయిన్ ఎవరు అని వెతుకుతుంటే నయనతార కనిపించారు. అలాంటి పాత్రకు ఆమెను కాకుండా వేరే హీరోయిన్ పెడితే అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని భావించి, ఆమెను ఈ సినిమాలో ఎలాగైనా సరే నటింపజేయాలని కోరుకున్నాను. అందులో భాగంగానే నిర్మాతలు సాహు గారపాటితో పాటు సుస్మిత కూడా రంగంలోకి దిగింది. కథ మొత్తం విన్న తర్వాత నాకు కథ నచ్చింది.. చిరంజీవి గారితో సినిమా చేయాలి. అయితే కొన్ని టెక్నికల్టీస్ కుదరడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అని అడిగింది.
ఒకవేళ నేను ఈ సినిమా చేయను అని చెబితే నువ్వేం చేస్తావని నయనతార నన్ను అడిగారు. ఇక వెంటనే నేను మీరు వెంకటేష్ గారి దృశ్యం సినిమా చూశారు కదా.. అందులో అనుకున్నట్టుగానే నేను ఈరోజు నయనతార గారికి ఫోన్ చేయలేదు.. ఆమెకు కథ చెప్పలేదు అని భావించి పడుకుంటాను అని చెప్పాను. ఆమె నవ్వేసి సరే ఈ సినిమా చేద్దాము కానీ ఆ టెక్నికల్టీస్ ఎలా క్లియర్ చేసుకుంటావో చేసుకో అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అందులో భాగంగానే కథ నచ్చడంతోనే ప్రమోషన్స్ కి కూడా ఇలా చేద్దాం అనగానే ఆమె సహకరించారు” అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. మొత్తానికైతే నయనతారను ఏదో లాగా ఒప్పించి ఈ సినిమాతో ఆమెకు మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు అనిల్ రావిపూడి.
చిరంజీవి ప్రశ్న.. అనిల్ సమాధానం!
నయనతారను ఒప్పించడానికి అనిల్ రావిపూడి చేసిన ప్రయత్నాలు, చిరంజీవి అడిగిన ప్రశ్నలు సినిమా ప్రమోషన్స్‌లో ఆసక్తికరంగా మారాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.


