|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గోదారి గొడవలు.. నవ్వులే నవ్వులు! ‘ఓం శాంతి శాంతి శాంతి’ ట్రైలర్ విడుదల!!

Published: 23-01-2026, 10:05 AM
గోదారి గొడవలు.. నవ్వులే నవ్వులు! 'ఓం శాంతి శాంతి శాంతి' ట్రైలర్ విడుదల!!
  • తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా ‘ఓం శాంతి శాంతి శాంతి’ చిత్రం జనవరి 30న విడుదల కానుంది.
  • గోదావరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బ్రహ్మాజీ డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
  • ఈ సినిమా మలయాళంలో విజయం సాధించిన ‘జయా జయా జయా జయహే’ చిత్రానికి రీమేక్.
  • దర్శకుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది మలయాళ చిత్రం ‘జయా జయా జయా జయహే’కు రీమేక్. ఈ చిత్రం జనవరి 30న విడుదల కానుంది.

గోదావరి నేపథ్యంలో చిత్రం

Om Shanti Shanti Shantihi: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతి(Om Shanti Shanti Shanti). ఈ సినిమా జనవరి 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ  జనవరి 30 వ  తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సాధారణంగా భార్యాభర్తల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది.

భార్యపై భర్త చేసే ఆగడాలను తట్టుకోలేక భార్య తిరగబడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే అంశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఈ సినిమా మొత్తం గోదారి జిల్లాలలో చేయటం వల్ల గోదారి యాసతో వచ్చే డైలాగులు కూడా  ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్రహ్మాజీ తరుణ్ భాస్కర్ తో మాట్లాడుతూ “మన  గోదారోళ్లకు ఎటకారం వచ్చినంత సులువుగా ప్రతికారాలు రావురా” అంటూ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)ఈషా రెబ్బ(Eesha Rebba) భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

భార్యాభర్తల మధ్య గొడవలే కథాంశం

ఇకపోతే ఈ సినిమా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న జయా జయా జయా జయహే అనే సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . తెలుగుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ద్వారా A. R సజీవ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇన్ని రోజులు దర్శకుడిగా తన సినిమాలతో మెప్పించిన తరుణ్ భాస్కర్ మొదటిసారి ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే తరుణ్ భాస్కర్ పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి వెండి తెరపై సందడి చేశారు. అయితే మొదటిసారి ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి హీరోగా తరుణ్ భాస్కర్ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఈషా రెబ హీరోయిన్ గా నటిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే అఫీషియల్ గా ఈ విషయాన్ని తెలియజేస్తూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.

జనవరి 30న విడుదల

మొత్తానికి ‘ఓం శాంతి శాంతి శాంతి’ చిత్రం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.