
📌 Key Points
- హృతిక్ రోషన్ – హోంబలే ఫిలిమ్స్ కాంబో కన్ఫర్మ్.
- పరశురామ్ దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్.
- హృతిక్ డబుల్ రోల్ – మాస్, స్టైలిష్ అవతార్లలో.
- రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో.
టాలీవుడ్, బాలీవుడ్ క్రాస్ ఓవర్ లో మరో సంచలనం. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై పూర్తి వివరాలు తెలుసుకోండి!
రూ. 300 కోట్ల భారీ బడ్జెట్: బాక్సాఫీస్ టార్గెట్!
స్టార్ హీరో హృతిక్ రోషన్, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఓ ప్రాజెక్టు రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. దీనికి ‘గీతా గోవిందం’, ‘సర్కారు వారి పాట’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మరో కొత్త విషయం ఏంటేంటే.. పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈమూవీలో హృతిక్ రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించొచ్చని స్ట్రాంగ్ బజ్. ఒకటి మాస్, ఇంకొకటి స్టైలిష్ అని టాక్. ఏకంగా.. ఈ ప్రాజెక్టును హోంబలే ఫిలిమ్స్ రూ. 300cr భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. అలాగే.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
హృతిక్ డబుల్ రోల్: మాస్, స్టైలిష్ అవతార్!
పరశురామ్ దర్శకత్వంలో పాన్ ఇండియా ధమాకా!
హృతిక్, హోంబలే, పరశురామ్ కలయికలో రాబోయే ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయం. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


