
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ చిత్రంపై అభిమానుల ఆసక్తి పెరిగింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఓ సర్‌ప్రైజ్ వెల్లడి కానుంది.
Key Points
హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' చిత్రం నుంచి మే 20న ప్రత్యేక అప్డేట్.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సర్‌ప్రైజ్ అప్డేట్.
హృతిక్ రోషన్ తన ట్వీట్ ద్వారా ఈ ఊహించని సర్ప్రైజ్ను ప్రకటించాడు.
ఫ్యాన్స్ మరియు సినీ ప్రేక్షకులు ఈ సర్‌ప్రైజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2 నుంచి క్రేజీ అప్డేట్
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్(NTR) కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’. ఇక యంగ్ టైగర్ నటిస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా రాబోతుంది. హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక ప్రత్యేకమైన ట్రీట్ లభించబోతుంది. మే 20న ఆయన బర్త్‌డే వేడుకలకు మరింత జోష్ నింపేందుకు వార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండబోతుందని హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో “తారక్.. ఈ సంవత్సరం మే 20న ఏమి జరుగుతుందో నీకు తెలుసనుకుంటున్నావా? నన్ను నమ్ము, ఏమి దాగి ఉందో నీకు ఏ మాత్రం అసలు తెలియదు. వార్ 2 కోసం సిద్ధంగా ఉండు” అంటూ హృతిక్ రోషన్ రాసుకొచ్చాడు. దీంతో ఈ మూవీ నుంచి ఏ సర్‌ప్రైజ్ రాబోతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
హృతిక్ రోషన్ ట్వీట్ వైరల్
ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్
హృతిక్ రోషన్ ట్వీట్‌తో వార్ 2 సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మే 20న వెల్లడయ్యే సర్‌ప్రైజ్ ఏంటో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


