|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో హృతిక్‌ స్టార్మ్‌

Published: 10-10-2025, 7:18 PM
ఓటీటీలో హృతిక్‌ స్టార్మ్‌

హృతిక్ రోషన్ నిర్మాతగా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఆయన తొలి వెబ్ సిరీస్ ‘స్టార్మ్‌’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నటుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త అడుగు వేయడం చాలా సంతోషంగా ఉందని హృతిక్ తెలిపారు.

Key Points

1

హృతిక్ రోషన్ నిర్మాతగా తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘స్టార్మ్‌’

2

వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది; అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం

4

నటుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న హృతిక్, నిర్మాతగా కొత్త అడుగు వేస్తున్నారు

హృతిక్ రోషన్ ఓటీటీ ఎంట్రీ

ఓటీటీలో హృతిక్‌ రోషన్‌ ‘స్టార్మ్‌’ మొదలైంది.పార్వతి తిరువోత్తు, ఆలియా .ఎఫ్, శ్రిష్టి శ్రీవాత్సవ, సబా ఆజాద్‌ ప్రధానపాత్రల్లో నటించనున్న వెబ్‌ సిరీస్‌ ‘స్టార్మ్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). ముంబై నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌ సిరీస్‌కు అజిత్‌పాల్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తారు. ప్రైమ్‌ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ సిరీస్‌కు హృతిక్‌ రోషన్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. శుక్రవారం ఈ ‘స్టార్మ్‌’ సిరీస్‌ను ప్రకటించి త్వరలోనే షూటింగ్‌ ఆరంభించనున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు.

హృతిక్‌ రోషన్‌కు నిర్మాతగా ఓటీటీలో తొలిప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. ‘‘భారతీయ వినోద రంగంలో నేను నిర్మాతగా పరిచయం అవుతున్నాను. ఇండస్ట్రీలో నటుడిగా నేను 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇలా కొత్త అడుగు వేయడం చాలా సంతోషంగా ఉంది. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న ‘స్టార్మ్‌’ సిరీస్‌ కథనం ఆకట్టుకుంటుంది’’ అని హృతిక్‌ రోషన్‌ పేర్కొన్నారు.

‘స్టార్మ్‌’ సిరీస్ కీలక వివరాలు

నిర్మాతగా హృతిక్ కొత్త అడుగు

యూనివర్సల్ అప్పీల్ ఉన్న ‘స్టార్మ్‌’ కథ ఆకట్టుకుంటుందని హృతిక్ రోషన్ నమ్మకం వ్యక్తం చేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన ప్రస్థానం విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.