
హైదరాబాద్ నగరంలో H-CITI ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. జూన్ 21న వన్-వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ మార్పులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలపై ప్రభావం చూపుతాయి.
Key Points
హైదరాబాద్ H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.
జూన్ 21, 2026న ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు వన్-వే ట్రయల్ రన్ నిర్వహణ.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలపై ప్రభావం, ప్రత్యామ్నాయ మార్గాలు సూచన.
ట్రాఫిక్ అప్డేట్ల కోసం సోషల్ మీడియా, హెల్ప్‌లైన్ నంబర్ (9010203626) అందుబాటులో.
కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ మార్పులు ఎందుకు?
KBR Park Traffic Diversions : హైదరాబాద్ నగరంలో కీలకమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిష్టాత్మకమైన స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఈ నిర్మాణ పనుల కారణంగా….. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. జూన్ 21, 2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకువన్-వే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుల ఆధారంగా వాహనదారులు ఎడమ, కుడి లేన్‌లలోకి మారడానికి ‘లేన్ చేంజర్స్’ ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.
1. NFCL వైపు నుంచి వెళ్లే వాహనదారులకు:
వన్ వే ట్రయల్ రన్: తేదీ, సమయం, రూట్స్
2. యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ వైపు నుంచి వెళ్లే వారికి:
మార్గాలు: రోడ్ నెం. 36 & 45, జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు.
3. ITC కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలు:
వాహనదారులకు ముఖ్య సూచనలు, హెల్ప్‌లైన్
ట్రాఫిక్ అప్డేట్ల కోసం ఫేస్‌బుక్ పేజీ (http://facebook.com/HYDTP), ఎక్స్/ట్విట్టర్ హ్యాండిల్ (@HYDP) ఖాతాలను ఫాలో అవ్వొచ్చు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే…. సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్: 9010203626 ను సంప్రదించవచ్చని పోలీసులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.
ఈ ట్రాఫిక్ మార్పులు తాత్కాలికమే అయినప్పటికీ, వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రయాణానికి ముందు ట్రాఫిక్ అప్‌డేట్‌లను తెలుసుకోవడం ద్వారా అనవసర ఇబ్బందులను నివారించవచ్చు. నగర అభివృద్ధికి ఈ ఆంక్షలు అవశ్యకం.


