
📌 Key Points
- యూఎల్‌సీ భూముల్లోని పాత లే ఔట్ల జోలికి వెళ్లమని హైడ్రా ప్రకటన.
- ఖాళీ ప్లాట్ల విషయంలో నగర ప్రజలను అప్రమత్తం చేసిన హైడ్రా.
- ప్రభుత్వ నిర్ణయం మేరకే తమ విధానాలు ఉంటాయని స్పష్టం.
- కొండాపూర్, కూకట్‌పల్లిలో ఆక్రమణల తొలగింపును గుర్తు చేసిన హైడ్రా.
హైడ్రా కీలక ప్రకటన విడుదల చేసింది. యూఎల్‌సీ భూముల్లోని పాత లే ఔట్లలో ఖాళీ ప్లాట్ల జోలికి వెళ్లమని స్పష్టం చేసింది. ఈ మేరకు నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆక్రమణదారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
యూఎల్‌సీ భూములపై హైడ్రా ప్రకటన
యూఎల్‌సీ(అర్బన్ ల్యాండ్ సీలింగ్) భూముల్లోని పాత లే ఔట్లలో ఇళ్లనే కాదు.. ఖాళీ ప్లాట్లు ఉన్నా వాటి జోలికి వెళ్లమని హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎల్‌సీ భూముల్లోని పాత లే ఔట్లలో రెగ్యులరైజ్ కాని ఖాళీ ప్లాట్లపై చర్యలుండవని స్పష్టంగా పేర్కొంది.
యూఎల్‌సీ భూముల్లో వెలసిన లే ఔట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను హైడ్రా పేరు చెప్పి ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వాటిని నమ్మవద్దని నగర ప్రజలను కోరింది. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించింది.
ప్రజలకు హైడ్రా సూచన
లే ఔట్ ప్రకారం రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా కాపాడుతుందని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పడడానికి (19.7.2024) ముందు నివాసాలుంటే వాటిని కూల్చమని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశామని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపింది.
ఈ మధ్య కాలంలో శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని పలు యూఎల్‌సీ భూముల్లో వేసిన లే ఔట్లలో పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలను మాత్రమే తొలగించామని హైడ్రా పేర్కొంది. కొండాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వరినగర్, ఓయూ కాలనీ, రాఘవేంద్ర కాలనీలోని పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలు తొలగింపే ఇందుకు నిదర్శనమని వివరించింది.
ఆక్రమణలపై హైడ్రా చర్యలు
కూకట్‌పల్లి మండలం హైదర్‌నగర్‌లోని యూఎల్‌సీ భూముల్లో వెలసిన గోపాల్‌నగర్ లే ఔట్‌లో పార్కును కూడా ఇదే మాదిరిగా కాపాడామని హైడ్రా గుర్తు చేసింది. యూఎల్ సీ భూముల్లోని లే ఔట్లలో రెగ్యులరైజ్ కాని ప్లాట్లను హైడ్రా తీసుకుని ప్రభుత్వానికి అప్పజెబుతుందని కొంతమంది కబ్జాదారులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. మీ ఇంటి స్థలాన్ని తక్కువ ధరకు సొంతం చేసుకోవాలనే కుట్రకోణం ఉందనే విషయాన్ని గ్రహించాలని హైడ్రా కోరింది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
హైడ్రా ప్రకటన నగర ప్రజలకు ఊరటనిచ్చే అంశం. యూఎల్‌సీ భూముల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. అక్రమార్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


