
📌 Key Points
- జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి హీరోగా నటించే ఆఫర్లు వచ్చాయి.
- మూడు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్‌లను ఆది తిరస్కరించాడు.
- తన బాడీకి ఫైట్స్, సాంగ్స్ సూట్ కావని హీరో ఆఫర్స్ వదులుకున్నాడు.
- మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంట ఆది.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి హీరోగా నటించే అవకాశాలు వచ్చాయట. మూడు కోట్ల విలువైన సినిమా ఆఫర్లను సైతం తిరస్కరించానని ఆది స్వయంగా వెల్లడించారు. తాను ఎందుకు ఆ ఆఫర్‌లను వద్దన్నానో చెప్పిన ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
కమెడియన్ గా ఆది ప్రస్థానం
అలాంటి సినిమాలు చేయాలన్న ఆది
Hyper Aadi : జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అనంతరం టీమ్ లీడర్ గా ఎదిగి ఫేమ్ తెచ్చుకున్నాడు. రైటర్ గా, కమెడియన్ గా సినీ, టీవీ పరిశ్రమలో ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. చేతి నిండా టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉన్నాడు ఆది. సినిమాల్లో కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నాడు.(Hyper Aadi)
హీరో ఆఫర్లు.. రిజెక్షన్ వెనుక రహస్యం
చాలా మంది కమెడియన్స్ హీరోలు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది తనకు కూడా హీరో ఛాన్సులు వస్తున్నాయనే విషయం తెలిపారు.
హైపర్ ఆది మాట్లాడుతూ.. హీరోగా కూడా ఛాన్సులు వచ్చాయి కానీ రిజెక్టు చేశా. నా ఫేమ్, నా ఫ్యాన్స్, వ్యూయర్ షిప్ చూసి కొంతమంది వచ్చారు. రెండు మూడు కోట్లతో సినిమాలు చేద్దామని కొన్ని కథలు తీసుకొని వచ్చారు. కానీ నేను వాళ్ళను పంపించేసాను. ఆ మూడు కోట్లు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పాను. ఆ కంటెంట్ కి సరిపోయే వాళ్ళు, మీ డబ్బులకు కనీసం పది రూపాయలు లాభం వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాను. ఆ డబ్బులు మీరు పోగొట్టుకొకూడదు అని చెప్పాను.
ఆది కోరుకున్న హీరో పాత్ర
నా బాడీకి ఫైట్స్, సాంగ్స్ చేస్తే చూడరు అని చెప్తాను. ఒకవేళ నేను హీరోగా చేయాలి అనిపిస్తే మలయాళం హీరో బసిల్ జోసెఫ్ లాగా పాటలు, ఫైట్స్ లేకుండా కేవలం కంటెంట్ ఉండే సినిమాలు అయితేనే చేస్తాను అని తెలిపారు. మరి భవిష్యత్తులో హైపర్ ఆది అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలతో హీరోగా వస్తాడేమో చూడాలి.
హైపర్ ఆది తన సినీ ప్రస్థానంలో కొత్త అడుగులు వేయాలని చూస్తున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాలతో హీరోగా వస్తే ఆదికి మంచి భవిష్యత్తు ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని తదుపరి ప్రాజెక్టుల కోసం వేచి చూద్దాం.


