|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? షాక్ అవుతారు

Published: 10-06-2025, 11:25 AM
హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? షాక్ అవుతారు

జబర్దస్త్ కామెడీ షోతో పేరు తెచ్చుకున్న హైపర్ ఆది, తన విద్యా విషయాలను వెల్లడించాడు. అతని 10వ తరగతి మార్కులు, స్కూల్ ర్యాంకులు, మరియు ఇంజనీరింగ్ విజయం గురించి తెలుసుకుందాం.

Key Points

1

హైపర్ ఆది 10వ తరగతిలో 534 మార్కులు సాధించాడు.

2

స్కూల్‌లో రెండో ర్యాంక్ సాధించాడు.

4

ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

హైపర్ ఆది విద్యార్హతలు

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన హైపర్ ఆది, తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో ఆడియన్స్ ను అలరించడంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. మొదట అదిరే అభి టీమ్‌లో సాధారణ కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన, కొద్ది కాలంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగి టాప్ కమెడియన్‌గా నిలిచాడు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.

బుల్లితెరపై తగ్గించి హైపర్ ఆది వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో మెరుస్తున్నాడు. సినిమా అవకాశాలు పెరుగుతున్నా కొద్ది.. ఇండస్ట్రీకి సబంధించిన అన్ని విభాగాలపై పట్టుసాధిస్తున్నాడు ఆది. రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన మేడ మీద అమ్మాయి సినిమాలో నటించడమే కాకుండా, ఆ సినిమాకి డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశాడు.

10వ తరగతిలో ఆది సాధించిన ర్యాంక్

ఇక తొలి ప్రేమ, సవ్యసాచి, వెంకీ మామ, అలా వైకుంఠపురం లో, క్రాక్, ధమకా, పుష్ప 2, దాస్ కా ధమ్కీ ఇలా వరుస సినిమాల్లో నటించి నవ్వులు పూయించాడు.ఇక కమెడియన్ గా సెటిల్ అయిన ఆది పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు అందరికి తెలిసినవే, అయితే హైపర్ ఆది ఏం చదువుకున్నాడో తెలుసా? ఆది ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. మంచి మార్కులు కూడా వచ్చాయట.

రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో స్టార్ కమెడియన్ల చదువుల గురించి, వారి మార్కుల గురించి వివరిస్తూ వారి మార్కుల జాబితాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది కూడా తన విద్యాసంస్థల గురించి, ఆయన కు 10వ తరగతిలో వచ్చిన మార్కుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఆది విద్యా ప్రయాణం

ఆది తెలిపిన వివరాల ప్రకారం, అతను పదో తరగతిలో మొత్తం 600 మార్కులకు గాను 534 మార్కులు సాధించి తన స్కూల్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అంతే కాకుండా, ఏడో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచిన అనుభవం కూడా ఉన్నదని, ఇప్పటికీ తన స్కూల్‌లో టాపర్స్ లిస్ట్‌లో “కోటా ఆదయ్య” అనే తన పూర్తి పేరు కనిపిస్తుందని చెప్పారు. చదువులోనూ తాను వెనుకబడిన వాడినని కాదు, ఇంటర్, బీటెక్ స్థాయిలో కూడా మంచి మార్కులు సాధించానని హైపర్ ఆది తెలిపాడు.

బుల్లితెర, వెండితెరలపై హాస్యంతో ఆకట్టుకుంటున్న హైపర్ ఆది చదువులోనూ తన ప్రతిభను నిరూపించాడన్న విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలిసి ఆది అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తూ.. హడావిడి చేస్తున్నారు. నెటిజన్లు నుంచి కూడా హైపర్ ఆదికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

హాస్యనటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న హైపర్ ఆది, చదువులోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. అతని విజయం అందరికీ స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.