
ఐ బొమ్మ సైట్ హెడ్ ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వందల కోట్ల పైరసీ నష్టానికి కారణమైన రవి పోలీస్ కస్టడీలో ఉండగానే ఐ బొమ్మ సైట్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన మెసేజ్ వచ్చింది. అసలు ఆ మెసేజ్ వెనుక ఏం జరిగింది, ఆ వివరాలేంటో చూద్దాం.
Key Points
ఐ బొమ్మ హెడ్ ఇమ్మడి రవిని పోలీసులు వందల కోట్ల పైరసీ నష్టానికి అరెస్ట్ చేశారు.
రవి వద్ద దాదాపు 21 వేల సినిమాలు, 50 లక్షల మంది డేటా ఉన్నట్లు విచారణలో తేలింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రవి అక్రమంగా 20 కోట్ల రూపాయలు సంపాదించాడు.
పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఐ బొమ్మ సైట్ నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు మెసేజ్ వచ్చింది.
రవి అరెస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు
I Bomma : ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్స్ తో ఎన్నో సినిమాలని పైరసీ చేసి సినీ పరిశ్రమకు వందల కోట్ల నష్టం కలిగించిన ఇమ్మడి రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు పైరసీ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాక పాలీసులకు దమ్ముంటే పట్టుకొమ్మని రవి ఛాలెంజ్ విసరడంతో అతన్ని అరెస్ట్ చేసారు.
పోలీస్ కస్టడీలో ఉన్న రవిని విచారించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. అతని దగ్గర దాదాపు 21 వేల సినిమాలు ఉన్నాయని, దాదాపు 50 లక్షల మంది డేటా ఉందని, దాన్ని డార్క్ వెబ్ కి అమ్ముకుందామని ట్రై చేసాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇల్లీగల్ గా 20 కోట్లు సంపాదించాడని పోలీసులు తెలిపారు. ఐ బొమ్మ సైట్ ని రవితోనే క్లోజ్ చేయించామని పోలీసులు తెలిపారు.
ఐ బొమ్మ సైట్ క్లోజ్.. అసలు మెసేజ్ ఏంటి?
రవి పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఐ బొమ్మ సైట్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఐ బొమ్మ సైట్ లో.. ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. మా సేవలను నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం అని పోస్ట్ చేసారు.
మెసేజ్ వెనుక ఎవరు? పోలీసులా, టీమా?
దీంతో ఐ బొమ్మ సైట్ పూర్తిగా క్లోజ్ అయినట్టే అని తెలుస్తుంది. అయితే ఐ బొమ్మ రవి పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు ఈ మెసేజ్ సైట్ లో ప్రత్యక్షమవడంతో పోలీసులే అతనితో పెట్టించారా? లేక బయట అతని టీమ్ పెట్టిందా అని చర్చ సాగుతుంది.
ఐ బొమ్మ రవి అరెస్ట్, సైట్ నుంచి వచ్చిన మెసేజ్ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై తదుపరి విచారణలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


