|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

I Bomma Ravi : ఓర్నీ.. ఐ బొమ్మ రవి పై బయోపిక్.. ఇదెక్కడి ప్లాన్..

Published: 19-11-2025, 10:41 PM
I Bomma Ravi : ఓర్నీ.. ఐ బొమ్మ రవి పై బయోపిక్.. ఇదెక్కడి ప్లాన్..

ఐ బొమ్మ పైరసీ వెబ్‌సైట్ ద్వారా సినిమా పరిశ్రమకు వేల కోట్లు నష్టం కలిగించిన ఇమ్మడి రవిపై బయోపిక్ రాబోతోంది. పోలీసులు అరెస్ట్ చేసిన ఐ బొమ్మ రవి జీవితంపై సినిమా తీయడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ బయోపిక్ ప్లాన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Key Points

1

ఐ బొమ్మ రవి పైరసీ ద్వారా సినిమా పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగించాడు.

2

పోలీసులను సవాలు చేసి, చివరికి ఐ బొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు.

4

ఐ బొమ్మ రవి బయోపిక్‌పై ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐ బొమ్మ రవి అరెస్ట్: అసలు ఏం జరిగింది?

I Bomma Ravi : ఐ బొమ్మ సైట్ తో పైరసీ సినిమాలు చూపించి ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించాడు ఇమ్మడి రవి. పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ చేసాడు. దీంతో పోలీసులు ఫోకస్ చేసి మరీ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసారు. అయితే పలువురు ఐ బొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశామని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐ బొమ్మ సైట్ లేదంటూ వాపోతున్నారు.

అయితే ఐ బొమ్మ రవి పై బయోపిక్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల ఎవరివి పడితే వాళ్ళవి బయోపిక్స్ చేస్తున్నారు. ఒకప్పుడు గొప్పగొప్ప వాళ్ళవి బయోపిక్స్ చేస్తే ఇపుడు మోసగాళ్లు, బ్యాంకులను కొల్లగొట్టే వాళ్ళను, స్మగ్లింగ్ చేసేవాళ్లను.. ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులను కూడా సినిమా మెటీరియల్స్ గా మారి, హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు.

ఐ బొమ్మ రవిపై బయోపిక్ ప్రణాళికలు

ఇప్పుడు ఐ బొమ్మ రవిపై కూడా సినిమా చేస్తారట. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థలో యూట్యూబర్ ఫేమ్ దొరసాయి తేజ ఈ సినిమా బయోపిక్ తీస్తాడని సమాచారం. ఐ బొమ్మ ఇమ్మడి రవి లైఫ్, అతని ఫ్యామిలీ ఆటుపోట్లు, ఐ బొమ్మని ఎలా మొదలుపెట్టాడు, దానికి వచ్చిన ఆదరణ, ఇప్పుడు అరెస్ట్.. ఇలాంటి అంశాలతో ఐ బొమ్మ రవి బయోపిక్ ని సినిమాగా తెరకెక్కిస్తారట.

బయోపిక్‌పై ప్రజల అభిప్రాయాలు

అయితే కొంతమంది జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని. మరి ఫ్రీగా సినిమాలు చూపించే వాడి సినిమా థియేటర్లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకొని వస్తారు, అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు కదా, అప్పుడు సినిమాకి నష్టమే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

వివాదాస్పద వ్యక్తి ఐ బొమ్మ రవిపై బయోపిక్ తీయాలనే నిర్ణయం చిత్ర పరిశ్రమలో, ప్రజల్లో కొత్త చర్చకు తెరలేపింది. అతని జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరిస్తారో, ఎలాంటి సందేశం ఇస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.