
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై రష్మిక తాజాగా స్పందించారు. డేటింగ్ గురించి, తన వివాహం గురించి ఆమె పరోక్షంగా చెప్పిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
Key Points
విజయ్ దేవరకొండ – రష్మికల నిశ్చితార్థంపై చక్కర్లు కొడుతున్న వార్తలు.
డేటింగ్ యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో, పెళ్లి విజయ్ తోనన్న రష్మిక.
అభిమానులు అనుకుంటున్న నిశ్చితార్థం వార్తలు నిజమేనని రష్మిక సంకేతం.
విజయ్ – రష్మికల వివాహం 2026 ఫిబ్రవరిలో జరగవచ్చని అంచనా.
విజయ్-రష్మిక నిశ్చితార్థం: అసలు నిజం
టాలీవుడ్ హాటెస్ట్ పెయిర్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలకు నిశ్చితార్థం జరిగినట్లు కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇంతవరకూ వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు. అబద్ధమైతే కనీసం వాటిని ఖండించలేదు. సో అది నిజమేనని అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో నిర్వహించిన చిట్ చాట్ లో రష్మిక తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన విషయాలు వైరల్ అవుతుండగా.. అదంతా విజయ్ గురించే చెప్పిందని అభిమానులు భావిస్తున్నారు.
డేటింగ్, వివాహంపై రష్మిక సమాధానం
అదే చిట్ చాట్ లో ఒక అభిమాని మీరు ఎవరితో డేట్ చేస్తారు ? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అని అడగ్గా.. రష్మిక ఠక్కున సమాధానం చెప్పారు. యానిమేషన్ క్యారెక్టర్ నరుటో తనకెంతో ఇష్టమని, డేట్ చేయాలనుకుంటే నరుటోతో చేస్తానన్నారు. పెళ్లి చేసుకుంటే విజయ్ ని చేసుకుంటా అనడంతో.. ఆడియన్స్ కంగ్రాట్స్ చెప్పారు. రష్మిక వారికి థాంక్స్ చెప్పడంతో.. వీరిద్దరి పెళ్లి రూమర్స్.. కేవలం రూమర్స్ కాదని కన్ఫర్మ్ అయింది. అలాగే తన ఎంగేజ్మెంట్ విషయంలో అభిమానులు అనుకుంటున్నదే నిజమని, టైమ్ వచ్చినపుడు అఫీషియల్ గా చెప్తానని స్పష్టం చేశారు. ఇక విజయ్ – రష్మికల పెళ్లి 2026 ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలుస్తోంది.
రష్మిక పెళ్లి: 2026 ఫిబ్రవరిలో?
Rashmika-Vijay: విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటాను.. ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
రష్మిక తాజా ప్రకటనతో విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం, వివాహం వార్తలు దాదాపుగా ఖరారైనట్లే. టైమ్ వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తానని చెప్పడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


