
📌 Key Points
- ఇరాన్ అణ్వాయుధం తయారు చేస్తున్నట్లు ఆధారాలు లేవని IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ ప్రకటన.
- యురేనియం నిల్వలు ఆయుధ స్థాయికి సమీపంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
- టెహ్రాన్ అణు కేంద్రాల్లోకి IAEA ఇన్‌స్పెక్టర్లకు అనుమతి నిరాకరణ.
- అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి సైనిక చర్యలు, ఇరాన్ ప్రతిస్పందనలు.
ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేస్తోందన్న అమెరికా ఆరోపణల నడుమ, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అణ్వాయుధం తయారు చేసినట్లు తమ వద్ద ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఐఏఈఏ ప్రకటనలో కీలక అంశాలు
ఇరాన్ అణ్వాయుధాన్ని సిద్ధం చేస్తోందని అమెరికా ఆరోపిస్తున్న వేళ.. ఇంటర్నేషనల్ అటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసినట్లు ప్రస్తుతానికి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక X ద్వారా కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ప్రస్తుతం అణు ఆయుధాన్ని తయారు చేస్తున్నట్లు ఎలాంటి ప్రూఫ్స్ లేవని స్పష్టం చేశారు. అయితే ఆయుధ స్థాయికి అత్యంత సమీపంలో ఉన్న యురేనియం నిల్వలు పెరిగిపోవడం మాత్రం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోందని గ్రోసీ పేర్కొన్నారు. టెహ్రాన్ తన అణు కేంద్రాల్లోకి ఐఏఈఏ ఇన్‌స్పెక్టర్లకు పూర్తిస్థాయి అనుమతి నిరాకరిస్తున్నంత కాలం.. ఇరాన్ అణు ఆయుధాన్ని తయారు చేయడం లేదన్నదానిపై ఖచ్చితమైన గ్యారెంటీ ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి సైనిక చర్యలు ప్రారంభించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దాడులకు ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలు ఉన్న పలు పర్షియన్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఒమన్లో జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ తన అణ్వాయుధ ప్రయత్నాలను పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఫిబ్రవరి 26న తమ యురేనియం శుద్ధి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తామని ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ హతమవ్వడంతో.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు కలవరపెడుతున్నాయి. ట్రంప్ ఆరోపణలే నిజమైతే మూడోప్రపంచయుద్ధం అనివార్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
యురేనియం నిల్వలపై ఆందోళన
ఇరాన్ చర్యలపై అమెరికా, ఇజ్రాయెల్ ఆందోళన
అమెరికా ఆరోపణల నేపథ్యంలో ఐఏఈఏ ప్రకటన ఆసక్తికరంగా మారింది. యురేనియం నిల్వల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలను విరమించుకుంటుందా వేచి చూడాలి.


