|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐబొమ్మ పూర్తిగా క్లోజ్‌.. లాగిన్‌ వివరాలు ఇచ్చేసిన రవి

Published: 16-11-2025, 12:44 AM
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్‌.. లాగిన్‌ వివరాలు ఇచ్చేసిన రవి

సినిమా పైరసీకి అడ్డాగా మారిన ఐబొమ్మ (i-Bomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను మూసివేయించారు. రవి లాగిన్, సర్వర్ వివరాలు ఇవ్వడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

Key Points

1

సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

2

ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను క్లోజ్‌ చేయించి, లాగిన్‌ వివరాలను రవి నుంచి తీసుకున్నారు.

4

రవికి 14 రోజుల రిమాండ్ విధించి, చంచల్‌గూడ జైలుకు తరలించారు; కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్, వెబ్‌సైట్ల మూసివేత

సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ  (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆపై వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు క్లోజ్‌ చేపించారు. విచారణలో భాగంగా అతని నుంచి వెబ్‌ లాగిన్స్‌తో పాటు సర్వర్‌ వివరాలను తీసుకుని మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు వెబ్‌సైట్లు ఓపెన్‌ కావడం లేదు. కూకట్‌పల్లిలోని అతడి ఫ్లాట్‌ నుంచి హార్డ్‌ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్‌లను  స్వాధీనం చేసుకున్నారు. అప్‌లోడ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను నిలిపివేశారు.

ఐబొమ్మ నిర్వహుకుడు ఇమ్మడి రవి గతంలో పోలీసులకు ఛాలెంజ​ చేశాడు. తన వద్ద కోట్లమంది డేటా ఉందని తనను టార్గెట్‌ చేస్తే ఏం చేయాలో తెలుసు అంటూ హెచ్చరించాడు. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అతని ఆదీనంలో ఉన్న వందల హార్డ్‌ డిస్క్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.  అతన్ని మెజిస్ట్రేట్‌ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు.

పోలీసులకు రవి సవాల్ – దర్యాప్తు ముమ్మరం

14 రోజుల రిమాండ్, కస్టడీకి పిటిషన్

ఐబొమ్మ కేసులో ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్ విధించి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించడానికి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఐబొమ్మపై దర్యాప్తు కొనసాగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.