|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐ బొమ్మ రవికి ఊరట: బెయిల్ మంజూరు! ఇకపై ఏం జరగనుంది? మళ్ళీ పైరసీ పండుగేనా?

Published: 17-02-2026, 8:05 AM
ఐ బొమ్మ రవికి ఊరట: బెయిల్ మంజూరు! ఇకపై ఏం జరగనుంది? మళ్ళీ పైరసీ పండుగేనా?
  • సినిమాల పైరసీ కేసులో ఐ బొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
  • గతంలో రవి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది, తాజాగా షరతులతో కూడిన బెయిల్ లభించింది.
  • రవి ప్రతిరోజు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరుకావాలి, పాస్ పోర్ట్ సబ్మిట్ చేయాలి.
  • కోర్టు అనుమతి లేకుండా నగరం దాటి వెళ్లకూడదు, ఇంటర్నెట్ వాడకూడదని ఆంక్షలు విధించారు.

సినిమా పైరసీ కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. గతంలో బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రవి విడుదల సినీ పరిశ్రమలో చర్చకు దారితీసింది.

ఐ బొమ్మ రవికి బెయిల్ మంజూరు

IBomma Ravi: సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి (Immadi Ravi)ఇన్ని రోజులపాటు రిమాండ్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇలా రిమాండ్ లో ఉన్న ఈయనకు పెద్ద ఊరట లభించింది. ఇన్ని రోజులపాటు రిమాండ్ లో ఉన్న రవికి బెయిల్ మంజూరు కావడం విశేషం. తెలంగాణ హైకోర్టు ఈయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను పైరసీ (Movie Piracy)చేస్తూ భారీ స్థాయిలో ఐ బొమ్మ రవి డబ్బు సంపాదించుకోవడమే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా కొన్ని వందల కోట్ల నష్టాలు రావడానికి కారణమయ్యారు ఈ నేపథ్యంలోనే పైరసీపై దృష్టి సారించిన అధికారులు ఐ బొమ్మ రవిని నవంబర్ నెలలో అదుపులోకి తీసుకున్నారు.

ఇలా అరెస్ట్ అయిన రవిని కోర్టుకు హాజరు పరచడంతో ఈయనను శిక్ష విధిస్తూ చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇలా జైలులో ఉన్నటువంటి ఈయన పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు మాత్రం ఈ పిటిషన్ కొట్టి వేస్తూ వచ్చారు.. ఇలా పోలీసులు విచారణలో ఈయన నుంచి అధికారులు పైరసీకి సంబంధించిన ఎన్నో విషయాలను రాబట్టారు. దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉన్నటువంటి రవికి బెయిల్ రావడంతో ఎంతోమంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవి అరెస్టు కావడంతో ఒక చిత్ర పరిశ్రమ మాత్రమే ఈయన అరెస్టును స్వాగతించింది కానీ సోషల్ మీడియా వేదికగా రవికి పూర్తిస్థాయిలో మద్దతు లభించిన సంగతి తెలిసిందే.

షరతులతో కూడిన బెయిల్ వివరాలు

ఇలా సినిమాలను పైరసీలకు పాల్పడుతూ రవి పోలీసులకు చిక్కడంతో మూడు నెలల అనంతరం బెయిల్ లభించింది. అయితే ఈయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటం విశేషం. రవి జైలు నుంచి బయటకు వచ్చినా, ప్రతిరోజు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కావాలి. విదేశాలకు పారిపోకుండా ఉండటం కోసం ఈయన పాస్ పోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయాలని తెలిపారు. అదేవిధంగా ఇంటర్నెట్ వాడటానికి కూడా వీలులేదని తెలిపారు. ఒకవేళ ఇంటర్నెట్ వాడాలి అంటే పోలీసుల అనుమతితోనే వాడాలని కోర్ట్ ఆంక్షలు విధించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా నగరం దాటి వెళ్లడానికి వీలు లేకుండా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇలా ఎన్నో ఆంక్షలు నడుమ ఈయనకు బెయిల్ మంజూరు చేశారు.

రవికి బెయిల్..వారికి పండగే..

నెటిజన్ల స్పందన, తదుపరి పరిణామాలు

ఐ బొమ్మ రవి బెయిల్ మీద బయటకు రావడంతో నెక్స్ట్ ఏంటి అంటూ అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈయన బెయిల్ మీద బయటకు రావడంతో సినిమాలను పైరసీలో చూసేవారికి పండుగనే చెప్పాలి. కోర్ట్ కండిషన్ల విషయానికి వస్తే రవి కనీసం ఇంటర్నెట్ కూడా వాడకూడదు అంటూ ఆంక్షలు విధించింది ఇలా ఇంటర్నెట్ వాడకుండా ఉండటం అనేది సాధ్యం కానీ విషయం అయితే ఈయన ఇంటర్నెట్ వాడకపోయినా కోర్ట్ కండిషన్ లను ఫాలో అవుతూ తనకున్నటువంటి నెట్ వర్క్ ద్వారా యధావిధిగా తన పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి . మరి బెయిల్ మీద బయటకు వచ్చిన రవి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

ఐ బొమ్మ రవి బెయిల్‌పై విడుదల కావడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆయన విడుదల పైరసీ అభిమానులకు సంతోషాన్ని కలిగించవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.