|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐబొమ్మ రవి కస్టడీలో షాకింగ్ నిజాలు: తెరపైకి ఆ ఇద్దరు కీలక వ్యక్తులు!

Published: 18-12-2025, 11:04 PM
ఐబొమ్మ రవి కస్టడీలో షాకింగ్ నిజాలు: తెరపైకి ఆ ఇద్దరు కీలక వ్యక్తులు!
  • ఐబొమ్మ రవిని మూడోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
  • సినిమాల పైరసీలో కీలక పాత్రధారులైన ప్రహ్లాద్, ప్రసాద్ పేర్లను రవి వెల్లడించాడు.
  • రవి సెయింట్ కిట్స్ పౌరసత్వం, ఐబొమ్మ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ ప్రహ్లాద్ పేరుపైనే ఉన్నాయి.
  • ప్రహ్లాద్ గురించి రవి నోరు విప్పకపోవడంతో పోలీసులు అతని పాత్రపై లోతుగా విచారణ చేస్తున్నారు.

ఐబొమ్మ రవి కస్టడీలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాల పైరసీలో కీలక పాత్రధారులైన ప్రహ్లాద్, ప్రసాద్ పేర్లను రవి వెల్లడించాడు. ప్రహ్లాద్ గురించి రవి మౌనంపై పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఇది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

రవి విచారణలో కీలక విషయాలు

ఐబొమ్మ రవిని మూడోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. 12 రోజుల పాటు రవిని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్ గూడ జైలులో రవిని కస్టడీలోకి తీసుకుని విచారించగా మరికొన్ని కీలక విషయాలను రవి వెల్లడించాడు. హెచ్ డీ సినిమాలను ఎలా పైరసీ చేస్తారని పోలీసులు ప్రశ్నించగా పూర్తి వివరాలు చెప్పినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఈ విచారణలో మరో ఇద్దరు కొత్త వ్యక్తుల పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. సినిమాల పైరసీలో వారు కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక అందులో ఒక పేరు ప్రహ్లాద్ కాగా మరొక పేరు ప్రసాద్. అయితే వీరిలో ప్రసాద్ ఎవరు అని ప్రశ్నించగా తన పదోతరగతి స్నేహితుడు అంటూ రవి సమాాధానం ఇచ్చాడు. కానీ ప్రహ్లాద్ గురించి అడిగితే రవి ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. రవి కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం తీసుకోగా అది ప్రహ్లాద్ పేరు పైనే ఉండటంతో ఈ కేసులో అతడు కీలకంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా ఐబొమ్మ వెబ్ సైట్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించాడు కానీ అతడి వివరాలు అడిగితే మాత్రం రవి నోరు విప్పడంలేదు. దీంతో ప్రహ్లాద్ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తెరపైకి ప్రహ్లాద్, ప్రసాద్ పేర్లు

ప్రహ్లాద్ ఎవరు? మిస్టరీ వీడేనా?

ఐబొమ్మ రవి కేసులో ప్రహ్లాద్ పాత్ర కీలకంగా మారింది. అతని పేరుపైనే వెబ్‌సైట్, పౌరసత్వం ఉన్నాయి. రవి మౌనంతో పోలీసులు అనుమానాలు పెంచుకున్నారు. పైరసీ మూలాలు త్వరలో బయటపడతాయని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.