|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐబొమ్మ రవికి ఊహించని రిలీఫ్! బెయిల్ మంజూరుతో జైలు నుండి విడుదల!!

Published: 17-02-2026, 8:35 AM
ఐబొమ్మ రవికి ఊహించని రిలీఫ్! బెయిల్ మంజూరుతో జైలు నుండి విడుదల!!
  • ఐబొమ్మ రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు!
  • ప్రతిరోజు సీపీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు!
  • దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్ట్ పోలీసులకు అప్పగించాలని సూచన!
  • గతేడాది నవంబర్ 16న ఐబొమ్మ రవి అరెస్ట్ గుర్తుందా?

టాలీవుడ్ లో సంచలనం! ఐబొమ్మ రవికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. గతేడాది నవంబర్ నుండి జైలులో ఉన్న రవి ఇప్పుడు విడుదల కానుండటంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి!

ఐబొమ్మ రవికి బెయిల్: అసలేం జరిగింది?

IBomma Ravi: ఐబొమ్మ రవికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈమేరకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఆలాగే, ప్రతి రోజు సీపీఎస్ ఎదుట హాజరుకావాలని సూచించింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవి(IBomma Ravi) గతే ఏడాది నవంబర్ 16న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రవి బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ, దొరకలేదు. ఎట్టకేలకు బెయిల్ ద్వారా జైలు నుండి విడుదల కాబోతున్నాడు రవి.

హైకోర్టు షరతులు: రవికి ఊరట లభించినట్టేనా?

టాలీవుడ్ లో కలకలం: రవి విడుదల వెనుక కథేంటి?

ఐబొమ్మ రవి విడుదల టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.