
IBOMMA వెబ్‌సైట్ ద్వారా సినిమా పైరసీకి పాల్పడుతున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుండి కరీబియన్ వరకు విస్తరించిన ఈ పైరసీ నెట్‌వర్క్ ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించినట్టు విచారణలో తేలింది. ఈ సంచలనాత్మక కేసులో మరిన్ని వివరాలు బయటపడనున్నాయి.
Key Points
IBOMMA వెబ్‌సైట్ ద్వారా సినిమా పైరసీకి పాల్పడుతున్న ఇమ్మడి రవి అరెస్ట్.
విశాఖపట్నం స్వస్థలం, కరీబియన్ దీవుల నుండి వెబ్‌సైట్ నిర్వహణ.
పైరసీ ద్వారా వందల కోట్ల సంపాదన, అతని బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు గుర్తింపు.
IBOMMA వెబ్‌సైట్‌ను పూర్తిగా క్లోజ్ చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
ఇమ్మడి రవి అరెస్ట్, పైరసీ నెట్‌వర్క్
సినిమాలు, వెబ్ సిరీస్‌లు పైరసీ చేస్తూ IBOMMA వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సైబర్ క్రైం పోలీసులు అతడి నుండి సంచలన విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. కరీబియన్ దీవుల్లో ఉంటూ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లిలో అతడు పట్టుబడిన అపార్ట్‌మెంట్‌లో పలు సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, కొన్ని సినిమాల హెచ్‌డీ ప్రింట్‌లు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అప్ లోడ్ చేయడానికి రెడీగా ఉన్న కొన్ని సినిమాలను హోల్డ్ లో పెట్టినట్టు కూడా గుర్తించారు. అతడి బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు ఉండగా, పైరసీ ద్వారా అతడు తక్కువ కాలంలోనే వందల కోట్లు సంపాదించినట్టు విచారణలో తేలింది. అతిత్వరలనే వెబ్ సైట్ ను పూర్తిగా క్లోజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఇమ్మడి రవిని విచారించి కోర్టులో హాజరుపరచగా మరో రెండు రోజుల పాటు దర్యాప్తు జరిపి పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఐబొమ్మ వెనుక రవి ఒక్కడే ఉన్నాడా.. ఇంకా ఎవరెవరు ఉన్నారు.. నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
వందల కోట్ల అక్రమ సంపాదన వివరాలు
IBOMMA వెనుక ఎవరు? పోలీసుల విచారణ
IBOMMA పైరసీ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అతి త్వరలో వెబ్‌సైట్‌ను పూర్తిగా మూసివేస్తామని పోలీసులు తెలిపారు.


