
📌 Key Points
- విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 77వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
- ఈ చిత్రానికి “ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47” అనే టైటిల్ అధికారికంగా ప్రకటించారు.
- శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2026 సమ్మర్‌కు విడుదల కానుంది.
- ఎస్.ఎస్. థమన్ పోస్ట్ ద్వారా సంగీత దర్శకుడిగా ఆయనపై చర్చ మొదలై, వైరల్ అవుతోంది.
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త సినిమా ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్. థమన్ పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో థమన్ పోస్ట్ వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త సినిమా
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా తన 77వ సినిమాని మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ సినిమాని 2026 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా జరగబోతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే నేడు చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు ఫలానా టైటిల్ పెట్టబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి.
ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా ఈ సినిమాకి “ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47″ (Aadarsha Kutumbam)అనే టైటిల్ పెట్టినట్లు అధికారక పోస్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ చూస్తుంటే కనుక ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన ”A ” సెంటిమెంట్ ఫాలో అయ్యారని తెలుస్తోంది.
ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా నటించబోతున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనే విషయంపై ఇప్పటివరకు సరైన స్పష్టత రాలేదు కానీ ఈ సినిమా కోసం ఎస్ ఎస్ తమన్ (S.S.Thaman)పనిచేస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో నందమూరి థమన్ కాస్త దగ్గుబాటి థమన్ గా మారబోతున్నారా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి సందేహాలు రావడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన వెంటనే థమన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మా ప్రియమైన త్రివిక్రమ్ గారు తన బ్లాక్ బాస్టర్ ప్రయాణాన్ని వెంకీ మామతో కలిసి నేడు ప్రారంభించారని, ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చూస్తుంటే అప్పుడే థియేటర్లు హౌస్ఫుల్ అయిన భావన కలుగుతుంది అంటూ ఈ సందర్భంగా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థమన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
“ఆదర్శ కుటుంబం” టైటిల్ ప్రకటనతో ఆసక్తి
Our Dearest T-R-I-V-I-K-R-A-M sir ♥️ Starts his Blockbuster Journey Today Along with Our dear @VenkyMama
The Combo I was Manifesting from a Very Longgggg time ♥️🙌🏿
Can feel the HOUSEFULLS Loaded with Families Already Heartfull Wishes to Our @haarikahassine #ChinnaBabu … pic.twitter.com/DEcLoR14ro
థమన్ పోస్ట్: నందమూరి నుంచి దగ్గుబాటి వరకు?
— thaman S (@MusicThaman) December 10, 2025
ఈ సినిమా గురించి థమన్ ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో ఈయన ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నారని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో థమన్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే తమ సంగీత సారథ్యంలో తెరకెక్కిన అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.
థమన్ పోస్ట్ తో వెంకటేష్ సినిమాకు సంగీతం అందించే అవకాశం స్పష్టమైంది. ఈ కొత్త కలయికపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


