
📌 Key Points
- భానుప్రియ డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారని సోదరి శాంతి ప్రియ వెల్లడి.
- సినిమా అవకాశాలలో మార్పులు ఆమె డిప్రెషన్‌కు కారణమయ్యాయి.
- భానుప్రియ 280 సినిమాలలో నటించి అవార్డులు అందుకున్నారు.
- ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని శాంతి ప్రియ తెలిపారు.
ప్రముఖ నటి భానుప్రియ కొంతకాలంగా డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారని, దీనివల్ల డిప్రెషన్‌కు గురయ్యారని ఆమె సోదరి శాంతి ప్రియ తెలిపారు. సినిమా అవకాశాలలో వచ్చిన మార్పులు ఆమెను మరింత కుంగదీశాయని ఆమె అన్నారు.
భానుప్రియ ఆరోగ్య పరిస్థితిపై శాంతి ప్రియ వెల్లడి
Bhanupriya: ప్రముఖ సీనియర్ హీరోయిన్, నాట్య మయూరి భానుప్రియ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయం, నృత్యంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తెలుగు, తమిళ్ ,కన్నడ అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడికి చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. భర్తతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే భర్తకు దూరమైంది.. భర్త మరణించడంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో డిమెన్షియా(జ్ఞాపకశక్తి కోల్పోవడం) అనే వ్యాధి బారిన పడింది భానుప్రియ.
అయితే ఈ వ్యాధి కారణంగా మళ్ళీ తనను తాను మునుపటి స్థితికి చేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే డాన్స్ స్కూల్ కూడా పెట్టాలనుకుందట. కానీ దానిని కూడా విరమించుకుంది. కొద్ది రోజులకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, మతిస్థిమితం కోల్పోయిందనే దుష్ప్రచారం కూడా జరిగింది. దీనిపై భానుప్రియ సోదరి , ప్రముఖ హీరోయిన్ శాంతి ప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ మేరకు తన అక్క ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి అభిమానులను కంఠతడి పెట్టించింది. మరి భానుప్రియ గురించి శాంతి ప్రియ చేసిన కామెంట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
డిప్రెషన్‌కు గురైన భానుప్రియ
శాంతి ప్రియ మాట్లాడుతూ..” మా అక్క గత కొంతకాలంగా డిప్రెషన్ కి గురైంది. ఆమెకు పెద్ద సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. తీరా షూటింగ్ సమయానికి ఆ పాత్రలో అనేక మార్పులు చేస్తున్నారు. ఇది ఆమెను మరింత బాధిస్తోంది. ముందు సినిమాలలో అవకాశం ఇస్తామని చెప్పి, ఆ పాత్రకు ఫైనల్ చేసిన తర్వాత షూటింగ్ స్పాట్ కి వెళ్ళాక మీ స్థానంలో ఇంకొకరిని తీసుకున్నాం అని చెప్పడంతో అక్క మరింత డిప్రెషన్ కి లోనవుతోంది.. తన సినీ కెరియర్లో 280 సినిమాలు చేసి.. ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి. ఈమె పట్ల సినిమా ఇండస్ట్రీ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నా సోదరిని చూడలేకపోతున్నాను. ప్రస్తుతం మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. కనీసం తనను 80’స్ స్టార్స్ రీయూనియన్ కి కూడా ఎవరూ పిలవడం లేదు. ప్రస్తుతం అక్క పరిస్థితి బాగోలేదంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయకండి అంటూ శాంతి ప్రియ తెలిపింది అంతేకాదు ఇకపై తన అక్క భానుప్రియ సినిమాలు చేయదు అని కూడా చెప్పింది. ఏదేమైనా భానుప్రియ గురించి వస్తున్న ఇలాంటి వార్తలను ఖండిస్తూ ఆమె చెక్ పెట్టింది.
భానుప్రియ ఆరోగ్యంపై వదంతులు ఖండించిన శాంతి ప్రియ
భానుప్రియ ఒకప్పుడు అపూర్వ సహోదరులు, బంగారు చిలక, చక్రవర్తి, పెదరాయుడు, అన్వేషణ ,ఆలాపన ,దొంగ మొగుడు, అన్నమయ్య, జయం మనదేరా ఇలా ఎన్నో చిత్రాలు చేసిన ఈమె చివరిగా శివ కార్తికేయన్ నటించిన అయలాన్ సినిమాలో హీరో తల్లిగా కనిపించింది. ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1998లో గ్రాఫిక్స్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకుంది. 2002లో కూతురు పుట్టింది. కానీ పెళ్లయిన ఏడేళ్లకే దంపతులిద్దరూ విడిగా జీవించడం మొదలుపెట్టారు కానీ విడాకులు తీసుకోలేదు. 2018 లో ఆదర్శ్ గుండెపోటుతో మరణించాడు. ఇక అప్పటినుంచి తల్లితోనే ఉంటోంది భానుప్రియ. ఇక ఇప్పుడు తన తల్లి కూడా గుండెపోటుతో ఇటీవల మరణించింది.
భానుప్రియ ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. శాంతి ప్రియ అందించిన సమాచారం ప్రజలకు ఊరటనిచ్చింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.


