|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ కి, తెలంగాణ పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్.. మీరు మా మీద ఫోకస్ చేస్తే ఏం చేయాలో అది చేస్తాం

Published: 01-10-2025, 2:49 AM
టాలీవుడ్ కి, తెలంగాణ పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్.. మీరు మా మీద ఫోకస్ చేస్తే ఏం చేయాలో అది చేస్తాం

తెలుగు చిత్ర పరిశ్రమను కలవరపరుస్తున్న ఐబొమ్మ వెబ్ సైట్ ఇప్పుడు తెలంగాణ పోలీసుల దృష్టిలో పడింది. ఐబొమ్మపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం కాగా, ఐబొమ్మ టాలీవుడ్, పోలీసులకు ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. తమపై దృష్టి పెడితే తాము కూడా తగిన రీతిలో స్పందిస్తామని స్పష్టం చేసింది.

Key Points

1

తెలుగు చిత్ర పరిశ్రమ, తెలంగాణ పోలీసులపై ఐబొమ్మ సంచలన హెచ్చరికలు.

2

పైరసీ నియంత్రణ ప్రయత్నాలపై ఐబొమ్మ నుండి ఘాటైన స్పందన.

4

ఇతర పైరసీ వెబ్ సైట్లపై దృష్టి పెట్టమని ఐబొమ్మ పోలీసులకు సూచన.

ఐబొమ్మపై పోలీసుల పైరసీ ఉచ్చు

తెలుగు చిత్ర పరిశ్రమకి, దక్షిణాది సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ వెబ్ సైట్ కొరకరాని కొయ్యగా మారింది. సినిమాలని పైరసీ చేస్తూ యూజర్లకు అందుబాటులో ఉంచుతోంది. హై క్వాలిటీ కంటెంట్ ని యూజర్లకు అందుబాటులో ఉంచడం ఐబొమ్మ ప్రత్యేకత. టాలీవుడ్ గతంలో చాలా సార్లు ఐబొమ్మ ఆటకట్టించడానికి ప్రయత్నించారు. కానీ దానిని నిర్మూలించడం సాధ్యపడలేదు. ఇటీవల తెలంగాణ పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం చాలా సీరియస్ గా పైరసీ వెబ్ సైట్లు, ఐబొమ్మపై ద్రుష్టి పెట్టారు.

దీనితో ఐబొమ్మ ఘాటుగా టాలీవుడ్ కి, పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. పోలీసులు ఇటీవల ఐబొమ్మ, బొప్పమ్ లాంటి పైరసీ వెబ్ సైట్లని తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు. దీనితో ఐబొమ్మ టాలీవుడ్ కి, పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మి ఆ తర్వాత ఏమీ పట్టనట్లు ఓటీటీలో ఎలా సొమ్ము చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మాపై ఫోకస్ చేస్తున్నారు. అసలు హీరోలకు అంత భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి ఎందుకు సినిమాలు చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్స్ చేయాల్సిన అవసరం ఏంటి.. అనవసర బడ్జెట్ భారం తప్ప.

ఐబొమ్మ ప్రతిదాడి: టాలీవుడ్ లోపాలు

సినిమాకి పనిచేసేది హీరో హీరోయిన్లు మాత్రమేనా ? వాళ్ళకే అధిక రెమ్యునరేషన్స్ ఎందుకు ? సినిమాకి పనిచేసే కార్మికులు, ఇతర సిబ్బంది చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే రెమ్యునరేషన్ ఏ కూలి పని చేసినా వస్తాయి. అనవసరంగా బడ్జెట్ పెంచేసి దానిని రికవరీ చేయడానికి మధ్యతరగతిపై పడుతున్నారు. టికెట్ ధరలు పెరగడం వల్ల బాధపడేది మధ్యతరగతి వాళ్ళే. మేము ఏ దేశంలో ఉన్నా భారత దేశం, తెలుగు వారి కోసం ఆలోచిస్తాం. ఫస్ట్ మీరు కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వేరే వెబ్సైట్స్ మీద ఫోకస్ పెట్టండి. మేము అంత మంచి వాళ్ళం కాదు.. బురదలో రాయి వేయకండి. చావుకి భయపడని వాడు దేనికీ భయపడడు అంటూ ఐబొమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది.

విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, కింగ్డమ్ చిత్రాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఐబొమ్మ వార్తల్లో నిలిచింది. నిర్మాతలు తమ సినిమాలు పైరసీ కాకుండా కొందరు ఏజెంట్లకు డబ్బులు ఇస్తున్నారని..ఐబొమ్మ పేరుతో ఫేక్ వెబ్ సైట్స్ క్రియేట్ చేస్తున్నారని ఐబొమ్మ గతంలో పేర్కొంది. అది ఆపకపోతే తాము ఏం చేయాలో అది చేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది.

పైరసీ వెనుక అసలు సమస్యలు

ఈ విధంగా ఐబొమ్మ తెలుగు చిత్ర పరిశ్రమ సినిమాలని కాపీ చేసి యూజర్లకు అందుబాటులో ఉంచుతూ.. అదే తెలుగు చిత్ర పరిశ్రమకి వార్నింగ్ ఇవ్వడం విడ్డూరం. తెలంగాణ పోలీసులు ఇటీవల థియేటర్స్ లో సినిమాని కెమెరాలతో షూట్ చేసే పైరసీ వెబ్ సైట్స్ ఏజెంట్స్ ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర డేటా స్వాధీనం చేసుకున్నారు. పైరసీ నివారణ కోసం తెలంగాణ పోలీసులు ఇటీల మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, దిల్ రాజు, నాని లాంటి సినీ ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

మొత్తంగా ఐబొమ్మ హెచ్చరికలు తెలుగు సినీ పరిశ్రమలో పైరసీ సమస్య, నిర్మాణ వ్యయాలపై తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.