
📌 Key Points
- ఐఐటీ తిరుపతిలో డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ అవకాశం!
- మార్చి 30లోపు దరఖాస్తు చేసుకోండి, ఉచిత వసతి పొందండి.
- ఎంపికైన టాప్ 5 అభ్యర్థులకు నెలకు రూ. 5 వేల స్టైఫండ్ లభిస్తుంది.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి మార్చి 20లోపు అప్లై చేయండి.
ఐఐటీ తిరుపతి విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐఐటీ తిరుపతిలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ అవకాశం
ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుంచి సమ్మర్ ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ, బీటెక్, పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభం కాగా…. మార్చి 30వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి.
నోటిఫికేషన్ లోని వివరాల ప్రకారం…. బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంస్సీ, బీఏ, ఎంఎ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, Civil and Environmental Engineering, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యూమానిటిస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథ్స్ అండ్ Statistics, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లలో ఖాళీలున్నాయి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వారికి ఉచిత వసతి సౌకర్యం ఉంటుంది. ప్రతి డిపార్ట్ మెంట్ లోని టాప్ 5లోని అభ్యర్థులకు నెలకు రూ. 5 వేల స్టైఫండ్ కూడా అందజేస్తారు.
మరోవైపు ఐఐటీ తిరుపతి నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 2 పోస్టులున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేయనున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు ఏమిటి?
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు మార్చి 20వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. కనీసం ఏడాది పాటు పని చేసిన ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి.
అర్హులైన అభ్యర్థులు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిని మాత్రమే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు… వారి ధ్రువపత్రాలతో పాటు బయోడేటాను తీసుకెళ్లాలి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే [email protected]. మెయిల్ ను సంప్రదించవచ్చు.
ఐఐటీ తిరుపతి అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఇంటర్న్‌షిప్‌తో మీ భవితకు బంగారు బాట వేసుకోండి. అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.


