|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇళయరాజా 8 కోట్ల కానుకలు, బంగారు కిరీటాలు, ఖడ్గం సమర్పించిన మ్యూజిక్ మాస్ట్రో

Published: 11-09-2025, 1:19 AM
ఇళయరాజా 8 కోట్ల కానుకలు, బంగారు కిరీటాలు, ఖడ్గం సమర్పించిన మ్యూజిక్ మాస్ట్రో

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కొల్లూరు మూకాంబిక దేవాలయానికి ఎనిమిది కోట్ల రూపాయల విలువైన కానుకలను సమర్పించారు. వజ్రాల కిరీటం, బంగారు ఖడ్గం వంటి విలువైన వస్తువులు ఆయన సమర్పించారు. ఈ కార్యక్రమం చర్చనీయాంశం అయ్యింది.

Key Points

1

ఇళయరాజా కొల్లూరు మూకాంబిక దేవాలయంలో ఎనిమిది కోట్ల విలువైన కానుకలు సమర్పించారు.

2

వజ్రాల కిరీటం, వజ్రాల హారం, బంగారు ఖడ్గం సమర్పణలో భాగం.

4

ఇళయరాజా పలు సినిమాలపై పాటల కాపీరైట్ వివాదాలలో ఉన్నారు.

ఎనిమిది కోట్ల విలువైన కానుకలు

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ  వజ్రాల కిరీటం, వజ్రాల హారం, బంగారు ఖడ్గం మూకాంబిక టెంపుల్‌లో సమర్పించారు.   కొల్లూరు మూకాంబిక దేవికి, వీరభద్రస్వామికి ఎనిమిది కోట్ల విలువ చేసే వజ్రాలతో చేసిన బంగారు ముఖరూపం, ఖడ్గం ఇళయరాజ సమర్పించారు. బుధవారం ఉదయం కొల్లూరు వచ్చిన ఇళయరాజ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య అడిగ సమక్షంలో ఆభరణాలు కొల్లూరు టెంపుల్‌కి సమర్పించారు.

ఇక ఈ కార్యక్రమంలో  కొడుకు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా కూడా ఇళయరాజతో ఉన్నారు. గత సంవత్సరం శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ టెంపుల్‌లోని గర్భగుడి ముందున్న అర్థ మండపంలోకి వెళ్లకుండా ఇళయరాజని టెంపుల్ అధికారులు ఆపారు. ఇళయరాజ ప్రార్థన కోసం అర్థ మండపంలోకి వెళ్లబోతుంటే టెంపుల్ అధికారులు, భక్తులు ఆపేశారు. ఈ క్రమంలో ఆయన దేవతా మూర్తులకు ఇంత విలువైన కానుకలు సమర్పించడం చర్చనీయాంశం అయ్యింది.

కొల్లూరు మూకాంబిక దేవాలయంలో సమర్పణ

ప్రస్తుతం ఇళయరాజా పలు రకాల వివాదాలకు కేంద్రం అయ్యారు. తన పాటలు అనుమతి లేకుండా వాడటంపై కొంత కాలంగా కొన్ని సినిమాలపై ఆయన లీగల్  నోటీసులు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గా సౌత్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై ఇళయరాజా హైకోర్టులో కేసు వేశారు. తన పాటలను అనుమతి లేకుండా సినిమాలో వాడారని, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

పాటల కాపీరైట్ వివాదాలు

ప్రస్తుతం  ఈ కేసు విచారణలో ఉంది.  అయితే, పాటలకు సంబంధించిన అసలు హక్కుదారుల నుంచి అనుమతి తీసుకున్నామని గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా  నిర్మాతలు చెబుతున్నారు. గతంలో తన ప్రాణ మిత్రుడు, దివంగత స్టార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో కూడా ఆయన ఇటువంటి చర్యలే తీసుకున్నారుే. అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ అయ్యింది.

ఇళయరాజా చేసిన భారీ విరాళం, ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, దేవాలయం పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది. అయితే, పాటల కాపీరైట్ వివాదాలు కూడా ఆయన మీద ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.