|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమాలకు దూరం కావడంపై ఓపెన్‌ అయిన ఇలియానా.. రీ ఎంట్రీపై, `రైడ్‌ 2`లో నటించకపోవడంపై క్లారిటీ

Published: 01-06-2025, 10:32 AM
సినిమాలకు దూరం కావడంపై ఓపెన్‌ అయిన ఇలియానా.. రీ ఎంట్రీపై, `రైడ్‌ 2`లో నటించకపోవడంపై క్లారిటీ

టాలీవుడ్‌లో మెరిసి, తర్వాత బాలీవుడ్‌లోనూ సందడి చేసిన ఇలియానా, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.

Key Points

1

ఇలియానా సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం గర్భం.

2

'రైడ్ 2'లో నటించకపోవడానికి కారణం గర్భం.

4

భవిష్యత్తులో సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.

ఇలియానా సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం

టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్‌ ఇలియానా తెలుగుకి దూరమై చాలా కాలమే అవుతుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. కానీ ఇప్పుడు అక్కడ కూడా సినిమాలు చేయడం లేదు. పిల్లలు పుట్టడంతో సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, అజయ్ దేవగన్ ‘రైడ్ 2’లో ఎందుకు నటించలేదో చెప్పారు. 2018లో వచ్చిన ‘రైడ్’లో ఇలియానా మాలిని పాత్ర పోషించారు. సీక్వెల్‌లో వాణీ కపూర్ ఆ పాత్ర చేశారు.

‘రైడ్ 2’ లో ఇలియానా ఎందుకు నటించలేదంటే?

‘రైడ్ 2’లో నటించకపోవడానికి కారణం

ఒక అభిమాని.. `రైడ్‌ 2`లో మిమ్మల్నిమిస్‌ అయ్యాం, అలాగే  సినిమాల్లోనూ మిస్‌ అవుతున్నాం.  మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడిగారు. దానికి ఇలియానా స్పందిస్తూ, ‘నేను సినిమాలనుచాలా మిస్‌ అవుతున్నా.  ‘రైడ్’ సూపర్ మూవీ. మాలిని పాత్ర నాకు చాలా ఇష్టం. దర్శకుడు రాజ్ కుమార్ గుప్తాతో, అజయ్ దేవగన్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియెన్స్.

‘రైడ్ 2’ ఆఫర్ వచ్చింది, కానీ పాప పుట్టడం వల్ల డేట్స్ సెట్ కాలేదు. నా ప్రయారిటీస్ అప్పుడు వేరేలా ఉన్నాయి. ట్రైలర్‌లో చూసినప్పుడు వాణీ కపూర్‌ ఆ పాత్రలో చాలా బాగున్నారు. తను బాగా చేసి ఉంటుందని నమ్ముతున్నాు. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు క్లియర్ అయ్యి ఉంటాయి` అని పేర్కొంది.

ఇంకొకరు ఇప్పుడెందుకు సినిమాల్లో కనిపించట్లేదని అడిగితే, ‘డైపర్లు, బేబీ క్రీమ్‌లతో బిజీగా ఉన్నా’ అని చెప్పింది. మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారని అడిగితే,  కచ్చితంగా వస్తా’ అని చెప్పింది. కానీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న ఇలియానా మళ్లీ సినిమాలకు రావాలంటే ఇంకా రెండు మూడేళ్లు పడుతుందని చెప్పొచ్చు.

భవిష్యత్తులో ఇలియానా సినిమాలకు తిరిగి రావడం

ఇలియానా తెలుగులోకి `దేవదాసు` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌ బాబు `పోకిరి` చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ అందుకుంది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

ఆ తర్వాత `ఖతర్నాక్‌`, `రాఖీ`, `ఆట`, `మున్నా`, `జల్సా`, `కిక్‌`, `రెచ్చిపో`, `సలీమ్‌`, `శక్తి`, `నేను నా రాక్షసి`, `జులాయి`, `దేవుడు చేసిన మనుషులు` వంటి చిత్రాల్లో నటించింది. స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. చివరగా   రవితేజ సరసన `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ`లో మెరిసింది ఇలియానా.

ఇలియానా ప్రస్తుతం తన కుటుంబంపై దృష్టి పెట్టినప్పటికీ, భవిష్యత్తులో సినిమాలకు తిరిగి రావాలనే ఆశావహతను వ్యక్తం చేసింది. ఆమె తిరిగి వచ్చే వరకు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.