
📌 Key Points
- భార్యపై ధీరజ్ ప్రేమను చూసి షాక్ లో భద్రావతి!
- ప్రేమకు యాక్సిడెంట్ చేసిన సేనాపతి గుండెల్లో దడ!
- భార్యకు ప్రేమతో అన్నం తినిపించిన ధీరజ్ వైరల్ వీడియో!
- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఊహించని ట్విస్ట్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సరికొత్త మలుపు తిరుగుతోంది. ధీరజ్ తన భార్య ప్రేమను వెనకేసుకొని రావడం, భద్రావతి యాక్సిడెంట్ గురించి ఆరా తీయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సీరియల్ లో ఏం జరగబోతుందో చూడాలి.
భార్యను వెనకేసుకొచ్చిన ధీరజ్
Illu Illalu Pillalu April 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో ప్రేమను తమ ఇంట్లోకి రమ్మని భద్రావతి పిలుస్తుంది. కానీ నా భార్యకు నేనున్నానని ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు యాక్సిడెంట్ పై భద్రావతి కూపీ లాగడంతో సేనాపతి టెన్షన్ పడతాడు. ప్రేమకు ధీరజ్ అన్నం తినిపిస్తాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమకు యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఆ యాక్సిడెంట్ కు సొంత తండ్రి సేనాపతి కారణం అవుతాడు. దీంతో ప్రేమను క్షమింమన్న సేనాపతి, యాక్సిడెంట్ అసలు నిజం చెప్పేస్తాడా? అన్నది ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో చూద్దాం.
ప్రేమ యాక్సిడెంట్ పై భద్రావతి ఆరా
ఇలాంటి వంకలు పెట్టుకుని నా భార్యను ఆ ఇంటికి రమ్మని నక్కజిత్తులు చూపిస్తే తోక కత్తిరిస్తానని భద్రావతికి ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. తను మా ఇంటి కోడలు. కష్టం వచ్చినప్పుడు మీ ఇంటికి పంపిస్తామని అనుకోండి. కష్టంలోనూ, సుఖంలోనూ కోడలిని కన్నబిడ్డలా చూసుకుంటామని రామరాజు కూడా చెప్తాడు.
సేనాపతి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి
రా, వచ్చి తినిపించమని ధీరజ్ ను ప్రేమ పిలుస్తుంది. కానీ ధీరజ్ ఒప్పుకోడు. డ్రెస్ ఛేేంజ్ చేసినప్పుడు లేదు కానీ ఇప్పుడు తినిపించమంటే వచ్చిందా అని ప్రేమ ఆడుకుంటుంది. ప్రేమ తిను అని ధీరజ్ తినిపిస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రోజుకో ట్విస్ట్ ఎదురు చూస్తూనే ఉంది. రాబోయే ఎపిసోడ్స్ మరింత ఉత్కంఠగా ఉండబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


